Andhra Pradesh: సీఎం జగన్‌తో బాలినేని భేటీ.. మధ్యలో ఐ-ప్యాక్ టీమ్.. ఆ ఇద్దరితోనే సమస్యట..!
మిషన్ బాలినేని! వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని వర్కవుట్ చేస్తున్న సబ్జెక్ట్. నెలరోజుల నుంచి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మళ్లీ పిలిచి మాట్లాడారు సీఎం జగన్. గురువారం మధ్యాహ్నం జరిగిన కీలక భేటీలో బాలినేనితో పాటు ఐ-ప్యాక్ టీమ్, మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
మిషన్ బాలినేని! వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని వర్కవుట్ చేస్తున్న సబ్జెక్ట్. నెలరోజుల నుంచి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మళ్లీ పిలిచి మాట్లాడారు సీఎం జగన్. గురువారం మధ్యాహ్నం జరిగిన కీలక భేటీలో బాలినేనితో పాటు ఐ-ప్యాక్ టీమ్, మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో పొడిపొడిగా మాట్లాడి వెళ్లారు బాలినేని. మరి.. పార్టీలో అసంతృప్త నేతగా ముద్ర పడ్డ బాలినేని ఇష్యూ సెటిలైనట్టేనా? బాలినేని పెట్టిన డిమాండ్లేంటి.. సీఎం ఇచ్చిన హామీలేంటి? ఏపీలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి.
గతంలో రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసేటప్పుడు కూడా సీఎంతో ముఖాముఖి మాట్లాడి అసంతృప్తిని వెలిబుచ్చారు బాలినేని. నెలరోజుల్లో రెండోసారి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో బాలినేని ఎపిసోడ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. తనకు ప్రకాశం, బాపట్ల ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని, ప్రోటోకాల్ సమస్యల్ని పరిష్కరించాలని, జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి జోక్యం ఉండకూడదని.. ఇలా అనేక డిమాండ్లను సీఎం ముందు పెట్టి పరిష్కరిస్తానన్న హామీ తీసుకున్నారు బాలినేని.
ఇప్పటికే పార్టీలో మిగతా నేతల నుంచి, ఐప్యాక్ నుంచి, ఇంటిలిజెన్స్ నుంచి రిపోర్టులు తెప్పించుకుని స్టడీ చేస్తున్న జగన్… బాలినేని ఇష్యూను సర్దుబాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. బాలినేనిని బుజ్జగించడానికి సీఎం ఇచ్చిన హామీలేంటి అనే అంశంపై సస్పెన్స్ నడుస్తోంది. ఇదే సమయంలో.. బాలినేని పార్టీ మారతారా లేదా అనే టాపిక్ కూడా ప్రకాశం జిల్లాలో జోరందుకుంది. వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇచ్చిన పక్షంలోనే బాలినేని పార్టీ మార్పు గురించి ఆలోచిస్తారని, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే.. ఎన్నికలకు రెండునెలల ముందే ప్రకటిస్తారని చెబుతున్నారు. కానీ.. బాలినేని పార్టీలో కొనసాగే అవకాశాలే ఎక్కువని, దానికి తగినట్టుగానే అధిష్టానం ప్రణాళికలు వేస్తోందన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..