Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కరెంట్ బిల్లుల పేరిట సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ..! పెండింగ్‌ బిల్లు కట్టాలంటూ జేబులు గుళ్ల

మీరు ఈ నెల కరెంట్ బిల్లు కట్టలేదా..? కరెంట్ బిల్లు కట్టలేదని రిపీటెడ్‌గా కాల్స్ లేదా మెసేజ్‌ గాని వస్తున్నాయా..? మేము పంపిన లింక్ పై క్లిక్ చేసి కరెంట్ బిల్లు చెల్లించమని ఎవరైనా చెబుతున్నారా..? అలా అయితే ఇది మీకోసమే.. తస్మాత్‌ జాగ్రత్త! ఇప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలు కొత్తతెర లేపి విద్యుత్ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి ఆన్‌లైన్ మోసాలకు గురైనట్లు ప్రస్తుతం..

Andhra Pradesh: కరెంట్ బిల్లుల పేరిట సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ..! పెండింగ్‌ బిల్లు కట్టాలంటూ జేబులు గుళ్ల
Cyber Crimes
Follow us
B Ravi Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Dec 18, 2023 | 1:56 PM

ఏలూరు, డిసెంబర్‌ 18: మీరు ఈ నెల కరెంట్ బిల్లు కట్టలేదా..? కరెంట్ బిల్లు కట్టలేదని రిపీటెడ్‌గా కాల్స్ లేదా మెసేజ్‌ గాని వస్తున్నాయా..? మేము పంపిన లింక్ పై క్లిక్ చేసి కరెంట్ బిల్లు చెల్లించమని ఎవరైనా చెబుతున్నారా..? అలా అయితే ఇది మీకోసమే.. తస్మాత్‌ జాగ్రత్త! ఇప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలు కొత్తతెర లేపి విద్యుత్ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి ఆన్‌లైన్ మోసాలకు గురైనట్లు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించిన ఎప్పటికప్పుడు కేటుగాళ్లు ఎత్తుకు పైఎత్తు వేస్తూనే ఉన్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల పలువురు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అధికారులమంటూ ఫోన్లు వచ్చాయి. విద్యుత్ సబ్స్టేషన్ ఫోన్లు చేస్తున్నామని, వినియోగదారులు ఇంకా విద్యుత్ బిల్లు చెల్లించకపోతే తాము పంపే లింకుపై క్లిక్ చేసి వెంటనే విద్యుత్ చార్జీలు చెల్లించాలని, అలా చెల్లించకపోతే తమ విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. దాంతో విద్యుత్ వినియోగదారులు బిల్లు చెల్లించకపోతే నిజంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారనే భయంతో వారు పంపిన మెసేజ్లు పై క్లిక్ చేసి లింకు ఓపెన్ చేసి వారు చెప్పినట్లుగా చేస్తున్నారు. దాంతో విద్యుత్ బకాయి చెల్లించేసామని ధీమాగా వున్న వినియోగదారుడికి తర్వాత నెలలో బిల్లు చెల్లించలేదని భారీగా ఫైన్ రూపంలో సంబంధిత అధికారులు విద్యుత్ బిల్లులు పంపుతున్నారు.

అదేంటి తాము ఎప్పుడో బకాయి బిల్లులు చెల్లించిన కూడా తరువాత నెలలో బిల్లు చెల్లించలేదని బిల్లు రావడంతో వినియోగదారులు ఖంగుతున్నారు. అయితే వారు చెల్లించిన సొమ్ము విద్యుత్ అధికారులకు చేరడం లేదు. వారితో విద్యుత్ అధికారులమని చెప్పి విద్యుత్ బిల్లులు కట్టమని అడిగింది సైబర్ మోసగాళ్లు కాబట్టి. చివరకు మోసపోయినట్లు గ్రహించిన వినియోగదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. దాంతో అటు విద్యుత్ అధికారులు, ఇటు పోలీసులు వినియోగదారులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. సైబర్ మోసగాల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఒకవేళ ఎవరైనా అలా మోసానికి గురైతే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
'నిందలేస్తే సరికాదు.. ఆధారాలేవి..?' పహల్గాం దాడిపై పాక్ రియాక్షన్
'నిందలేస్తే సరికాదు.. ఆధారాలేవి..?' పహల్గాం దాడిపై పాక్ రియాక్షన్
దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..
దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్