YSRCP: ఈ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్.. వీరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న వైసీపీ

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ త‌న క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసారు. ఇప్పటికే అభ్యర్థులు,ఇంచార్జ్‎ల మార్పుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మొద‌టి విడ‌త‌లో 11 మంది ఇంచార్జ్‎ల‌ను మార్పు చేసిన ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. అదే తరహాలో రెండో విడ‌త జాబితా ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

YSRCP: ఈ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్.. వీరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న వైసీపీ
Ap Cm Ys Jagan
Follow us
S Haseena

| Edited By: Srikar T

Updated on: Dec 18, 2023 | 3:14 PM

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ త‌న క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసారు. ఇప్పటికే అభ్యర్థులు,ఇంచార్జ్‎ల మార్పుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మొద‌టి విడ‌త‌లో 11 మంది ఇంచార్జ్‎ల‌ను మార్పు చేసిన ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. అదే తరహాలో రెండో విడ‌త జాబితా ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే రెండో విడ‌త‌లో ఎవ‌రెవరికి సీటు దక్కడం లేద‌న్నదానిపై ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయా ఆయా అభ్యర్థులకు స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ సమన్వయకర్తల్లో మార్పులు పూర్తిగా స‌ర్వేల‌పైనే ఆధార‌ప‌డ్డారు వైసీపీ బాస్.

ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న అనుకూల‌, ప్రతికూల అంశాలు, పార్టీ స్థానిక నేత‌ల‌తో ఉన్న సంబంధాలు, అవినీతి ఆరోప‌ణ‌లు, ప్రత్యర్థిని ఢీ కొట్టగల సామ‌ర్ధ్యం ఉందా లేదా.. ఇలాంటి అన్ని అంశాల‌లో స‌ర్వేలు చేయించారు సీఎం జ‌గ‌న్. ఈ స‌ర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక‌పై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా స‌ర్వే నివేదిక‌లు సిద్దమైనట్లు తెలిసింది. మొద‌టి జాబితాలో మార్పులు చేసిన 11 మందితో పాటు మ‌రో న‌ల‌భై మంది వ‌ర‌కూ సిట్టింగ్‎లు, ఇంచార్జ్‎ల మార్పు ఉండ‌వ‌చ్చని తెలుస్తోంది. దీంతో త‌మ‌కు సీట్లు ఉంటాయా లేదా అని లెక్కలేసుకునే ప‌నిలో ప‌డ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. త‌మ రిపోర్ట్ ఎలా ఉంది.? అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్ వ‌స్తుందా అనే ఆందోళ‌న‌లో ఉన్నారు పలువురు నేతలు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే ప‌లువురు ఎమ్మెల్యేల‌కు సీటు ఉండ‌ద‌ని వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలిసింది.

అభ్యర్థులకు అధిష్టానం నుంచి ఫోన్‎లు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిలో కైక‌లూరు, నూజివీడు నియోజ‌క‌వ‌ర్గాలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఇక కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో ప‌లువురు సిట్టింగ్‎ల‌కు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లిన‌ట్లు తెలిసింది. వీరిలో జిల్లా మంత్రి కూడా ఉన్నట్లు చ‌ర్చ జ‌రుగుతుంది. పెడ‌న ఎమ్మెల్యేగా ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్‎కు కూడా త‌న స్థానం మార్పు చేస్తున్నట్లు అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. జోగి ర‌మేష్‎ను పెడ‌న నుంచి కాకుండా విజ‌య‌వాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లా నుంచి రెండు అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నారు మంత్రి జోగి ర‌మేష్. త‌నతో పాటు కొడుకు రాజీవ్‎కు కూడా సీటు ఆశిస్తున్నారు. సిట్టింగ్ స్థానం పెడ‌న‌తో పాటు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కూడా త‌న కుటుంబానికి ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈ రెండు కాకుండా విజ‌య‌వాడ ఎంపీ బ‌రిలో దిగాల‌ని అధిష్టానం పెద్దలు సూచించిన‌ట్లు స‌మాచారం.

ఇవి కూడా చదవండి

ఇక తిరువూరు ఎమ్మెల్యేకి కూడా ఈసారి సీటు లేద‌ని తెలిసింది. వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రక్షణనిధిపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత, నాయ‌కుల్లో కూడా వ్యతిరేకత ఉండ‌టంతో ఆయ‌న‌కు ఈసారి సీటు లేద‌ని తెలుస్తోంది. ఇక అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ బాబు స్థానంలో బీసీ అభ్యర్థికి అవ‌కాశం ఇచ్చే యోచ‌న‌లో ఉన్నార‌ట సీఎం జ‌గ‌న్. ఇక్కడ టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో కాపు సామాజిక వర్గానికి కాకుండా బీసీ సామాజిక వ‌ర్గానికి సీటు ఇస్తే గెలుస్తామ‌నే ఉద్దేశంతో పాటు సింహాద్రి ర‌మేష్ పై అంత అనుకూల‌త లేద‌ని తెలుస్తోంది. ఇక మ‌రో ఎస్సీ రిజ‌ర్వ్‎డ్ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో కూడా జ‌గ‌న్ తుది నిర్ణయం తీసుకుంటార‌ని స‌మాచారం. మ‌రోవైపు కీల‌క‌మైన రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను షిఫ్ట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మొత్తానికి టీడీపీ కీల‌కంగా భావిస్తున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. గ‌తంలో మాదిరిగానే ఈసారి అధిక సీట్లు గెలిచేలా వైసీపీ అధిష్టానం ఫోక‌స్ పెట్టిన‌ట్లు పార్టీ వ‌ర్గాల నుంచి వస్తున్న స‌మాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో