AP CM Jagan: నేడు అచ్యుతాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఏటీసీ టైర్ల పరిశ్రమ తొలి యూనిట్ ప్రారంభోత్సవం
జపాన్ కు చెందిన యోకహామా గ్రూప్ నకు చెందిన ఏటీసీ టైర్ల పరిశ్రమను ఇక్కడ దాదాపు 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 1,500 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ ను నిర్మిస్తున్నారు.
AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆగస్టు 16న(నేడు) అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ పట్నంలోని ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి అచ్యుతాపురం బయలుదేరి వెళ్లనున్నారు.. అక్కడ నిర్మించిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీని ప్రారంభించనున్నారు. జపాన్ కు చెందిన యోకహామా గ్రూప్ నకు చెందిన ఏటీసీ టైర్ల పరిశ్రమను ఇక్కడ దాదాపు 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 1,500 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తోలి యూనిట్ సిద్ధమైంది. ఈరోజు సీఎం చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభోత్సవమ్ జరుపుకోనుంది. ఈ ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ దాదాపు 2,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించింది.
వ్యవసాయం , మైనింగ్‌లో ఉపయోగించే వాహనాలకు టైర్లను కంపెనీ తయారు చేస్తుంది. మరో 1,000 కోట్ల రూపాయలను వెచ్చించి, మరో 1,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా విస్తరణకు వెళ్లాలని యోచిస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజుతో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పరిశీలించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం.. సీఎం జగన్ ఎమ్మెల్యే గణేశ్ ఇంటికి వెళ్లనున్నారు. గణేష్ తనయుడు వివాహం ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..