CM Jagan Tour: రెండో రోజూ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన.. నేరుగా బాధితులతో సమావేశం..
నేడు జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. వరద ముంపు బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.
CM Jagan Tour: సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు వరద ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గత కొంతకాలంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. వరద ముంపు బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి ముఖ్యమంత్రి బయలుదేరి ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు చేరుకోనున్నారు. చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లోని వరద బాధితులతో సమావేశం కానున్నారు. బాధితులను అక్కడ తాజా పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు.
మధ్యాహ్నం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశం కానున్నారు సీఎం. బాధితులకు అందిన సహాయ సహకారాలపై ఆరా తీయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1PM అక్కడి నుంచి బయలుదేరి సీఎం జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..