Andhra Pradesh: జగన్ సర్కారు సంచలన నిర్ణయం.. అవినీతికి చెక్ పెట్టే దిశగా విప్లవాత్మక అడుగు..
Andhra Pradesh: అవినీతిలేని పాలన అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనే మాటకు తావు లేకుండా టెక్నాలజీని..
Andhra Pradesh: అవినీతిలేని పాలన అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనే మాటకు తావు లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా ‘ఏసీబీ 14400’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ సహాయంతో ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఎవరి దగ్గరికి వెళ్లుకుండా నేరుగా యాప్‌లోనే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసేలా రూపొందించారు.
ఈ విషయమై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. ఏసీబీ 14400 కాల్ సర్వీసులు, దానిపై రూపొందించిన యాప్‌పై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సమీర్ శర్మ ఆదేశించారు. ఏసీబీ 1400 యాప్‌లో వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించినట్లు, ఎవరైనా కంప్లైంట్ చేసిన వెంటనే సంబంధిత మొబైల్‌కు ఫిర్యాదుకు సంబంధించిన రిఫరెన్స్ వస్తుందని సమీర్ శర్మ వివరించారు. ఇక ఈ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో డిస్‌ప్లే బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను సమీర్ శర్మ ఆదేశించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..