CM Jagan: ధాన్యం కొనుగోలు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఇకపై వారే..
Andhra Pradesh: ధాన్యం కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుడుతోంది.

Andhra Pradesh: ధాన్యం కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుడుతోంది. మిల్లర్లను తప్పించి ఇకపై ధాన్యం సేకరణ బాధ్యతలను వాలంటీర్ల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతులకు అనేక సదుపాయాలు కల్పిస్తుంది సర్కార్. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖపై సమీక్షలో కొత్త ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో అక్రమార్కులకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంటున్నారు. మిల్లర్ల వ్యవస్థలకు చెక్ పెడుతూ రైతుల నుంచి వాలంటీర్లే ధాన్యం సేకరించేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఇకపై ఈ పంట ద్వారా వాలంటీర్లు రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయనున్నారు. దీనికోసం వారికి ఇంసెంటివ్స్ కూడా ఇవ్వనుంది ప్రభుత్వం.
మరోవైపు ఆర్బీకేల పరిధిలో వైయస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేలలో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని 10,750 ఆర్బీకేలలో ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ పూర్తి చేసినట్లు సీఎంకు వివరించారు అధికారులు. ఇక ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..