Andhra Pradesh: అన్నమయ్య జిల్లాకు పాకిన అన్న క్యాంటిన్‌ల లొల్లి.. అక్కడ 144 సెక్షన్ విధింపు.
Andhra Pradesh: అన్న క్యాంటీన్‌ల లొల్లి అన్నమయ్య జిల్లాను టచ్ చేసింది. ఓవైపు అన్న క్యాంటీన్‌కి పర్మిషన్ లేదని పోలీసులు.. ఎందుకు ఇవ్వరని టీడీపీ శ్రేణులు..
Andhra Pradesh: అన్న క్యాంటీన్‌ల లొల్లి అన్నమయ్య జిల్లాను టచ్ చేసింది. ఓవైపు అన్న క్యాంటీన్‌కి పర్మిషన్ లేదని పోలీసులు.. ఎందుకు ఇవ్వరని టీడీపీ శ్రేణులు మరోవైపు వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారింది వివాదం. 144 సెక్షన్ విధించేదాకా వెళ్లింది. పెద్ద తిప్పసముద్రంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసింది టీడీపీ. పెద్ద సంఖ్యలో కార్యకర్తల మధ్య ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ వెళ్లారు. అంతలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అనుమతి లేదంటూ ఒక్కమాటలో తేల్చేశారు. దీంతో షాకయిన తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు తమ్ముళ్ల నినాదాలతో దద్దరిల్లింది. పేదోళ్ల కడుపు నింపే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు నేతలు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సిట్యువేషన్ సీరియస్‌గా మారకముందే 144 సెక్షన్ అనౌన్స్ చేశారు.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య అన్న క్యాంటీన్ ప్రారంభించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద తిప్ప సముద్రంలో భారీగా మోహరించారు. మొన్న కుప్పంలో దాడి.. నిన్న తెనాలిలో అభ్యంతరాలు.. ఇలా ఎక్కడో ఒకచోట అన్న క్యాంటీన్లపై రగడ కంటిన్యూ అవుతూనే ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..