Amaravati: మాజీ మంత్రి నారాయణ దంపతులకు సీఐడీ నోటీసులు.. ఇంటివద్దే విచారణ..

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై ఏపీ మాజీ మంత్రి నారాయణ దంపతులకు నోటీసులు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

Amaravati: మాజీ మంత్రి నారాయణ దంపతులకు సీఐడీ నోటీసులు.. ఇంటివద్దే విచారణ..
Narayana CID
Follow us

|

Updated on: Mar 04, 2023 | 7:57 AM

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై ఏపీ మాజీ మంత్రి నారాయణ దంపతులకు నోటీసులు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. నారాయణను, ఆయన భార్య రమాదేవితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలను ఇంటి దగ్గరే విచారించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరికొందరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

అయితే ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఈనెల 6న నారాయణ దంపతులు సహా కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులిచ్చింది. నారాయణ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని దమ్మాలపాటి కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే నారాయణను కూడా ఇంటి దగ్గరే విచారించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకొని పిటిషనర్లను ఇంటి దగ్గరే విచారించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. ద‌ర్యాప్తున‌కు రావాలంటూ నోటీసులు అంద‌జేశారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో అప్పట్లో ఏపీలో పొలిటికల్‌ దుమారం రేగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో