Andhra Pradesh: హైదరాబాద్‌లోని టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటిపై ఏపీ సీఐడీ దాడులు.. 41A కింద నోటీసులు..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ట్రెండ్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు హల్‌చల్ చేశారు. విజయ్ ఇంట్లోకి వచ్చి..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ట్రెండ్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు హల్‌చల్ చేశారు. విజయ్ ఇంట్లోకి వచ్చి.. సోదాలు నిర్వహించారు. ఆయన లేకపోవడంతో సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, విజయ్ లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు సీఐడీ పోలీసులు.
విచారణకు హాజరు కావాలని 41A నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన 10:30 గంటలకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. U/s 66(c) of it act, సెక్షన్ 419,469,153(a)505(2), 120(b)r/w 34 IPC యాక్ట్ కింద విజయ్‌పై సీఐడీ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్స్, మోబైల్ ఫోన్స్‌తో పాటు, ఐడి, అడ్రస్ ప్రూఫ్‌తో హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాని పక్షంలో 41A(3), (4) crpc సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలాఉంటే.. ఈ ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ కుటుంబ సభ్యులు. ఎందుకు వచ్చారో, కేసు ఏంటో కూడా చెప్పలేదని ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఇంట్లో పిల్లలు ఉన్న సయమంలో పోలీసుల పేరుతో హల్‌చల్ చేశారని, అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియదని వారు అంటున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు నిర్వహించాలని తమను బెదిరించినట్లు విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం సాగిస్తామన్నారు విజయ్ కుటుంబ సభ్యులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..