స్మశానంలోని శివయ్య విగ్రహం ముందు ఉంచిన దేహం నుంచి ఓంకారం.. ఎక్కడో తెలుసా?
మానవ జీవితంలోని చివరి అంఖం అంతిమ యాత్ర ప్రతి మనిషి మృతి చెందిన తరువాత వారి కుటుంబ సభ్యులు వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం వారి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. పూర్వం చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతుకుతాడనే నమ్మకం కూడా ఉండేది.ఇప్పటికి హిందువుల అంతిమ యాత్ర సమయంలో మూడుసార్లు పాడెను కిందకు దించి కొడుకో,లేక ఖర్మ చేసే వారితోనో చనిపొయిన వ్యక్తి చెవిలో మృతుడిని పేరుతో పిలుస్తారు.

ఇక స్మశానానికి వెళ్ళిన తరువాత పాడె పై మృతుడిని ఉంచి కట్టెలు పేర్చి, ఆవు నెయ్యి పోసి, గంధం చెక్కలు వేసి ,నీటికుండతో కర్మ చేసే వ్యక్తి మూడు సార్లు ప్రదిక్షిణ చేస్తారు. తల కొరివి పెట్టిన తరువాత కపాలమోక్షం వరకు బంధు మిత్రులు అక్కడే ఉంటారు. ఇంతటి ప్రాధన్యత ఉన్న స్మశానాలు ఇపుడు నిర్లక్ష్యంతో మురికి కూపాలు గా మారాయి.మృతి చెందిన వారికి దహన సంస్కారాలు చేయాలి అంటే కూడా వెళ్లిన వారు నరకం చూడవలసిందే తీవ్ర దుర్గంధం అపరిశుభ్రత తో శ్మశాన వాటికలు ఉంటున్నాయి అక్కడ మూడు నిమిషాలు కూడా ఉండ లేని పరిస్థితులు దాపురించాయి.
కానీ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తన స్వంత నియోజకవర్గం పాలకొల్లు లో ని శ్మశాన వాటికలో ముక్కు మూసుకుని దహన సంస్కారాలను చేసే దుస్థితికి స్వస్థి పలకాలని చివరి మజిలీ కార్యక్రమం ఆహ్లాదమైన వాతావరణం బంధు మిత్రులు సమక్షంలో జరిగే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు దహన సంస్కార చేసే ముందు శివుని విగ్రహం ముందు ఉన్న బల్ల పై పడుకోబెడితే ఓంకారం ధ్వనించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆహ్లాదమైన ఒక సుందర పార్క్‌లా కైలాసవనాన్ని నిర్మించారు.
పట్టణంలో లేదా చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా మృతి చెందితే తమ బంధువులు ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా పరిశుభ్ర వాతావరణంలో తమ ఆత్మీయుల అంత్యక్రియలు దగ్గర ఉండి జరిపించుకునేలా నిర్మించారు. అంతే కాదు సాక్షాత్తు ఆ పరమ శివుడు శ్మశాన సంచారం చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు. దీంతో స్మశానంలో శివుని విగ్రహం తో పాటు ప్రత్యేకమైన రాతితో నిర్మించిన బల్లను ఏర్పాటు చేశారు.దీనిని ప్రత్యేకించి భువనేశ్వర్ లో తయారు చేయించి తీసుకువచ్చి శ్మశాన వాటికలో ఏర్పాటు చేశారు. దీని పై దహన సంస్కారాలు చేసే పార్థీవ దేహాన్ని ఉంచితే ఓంకారం ధ్వనించేలా ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




