AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: దుర్గగుడిలో కిడ్నాప్ యత్నం.. బాలుడిని రక్షించిన తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్‌ఐ

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కిడ్నాప్ కలకలం రేపుపింది. ఆలయంలో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని చూసి ఆగంతకుడు అమాంతం బాలుడిని ఎత్తుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఏఎస్‌ఐ సత్యనారాయణ కంటపడ్డారు. దీంతో నిందితులు బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయారు. అగంతకుల చర నుంచి బాలుడిని రక్షించిన ఏఎస్‌ల చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Indrakeeladri: దుర్గగుడిలో కిడ్నాప్ యత్నం.. బాలుడిని రక్షించిన తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్‌ఐ
Vijayawada Child Kidnapping
M Sivakumar
| Edited By: Anand T|

Updated on: Oct 12, 2025 | 5:35 PM

Share

విజయవాడ దుర్గగుడిలో ఆదివారం ఓ బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆలయంలో ఒంటరిగా కనిపించిన బాలుడిని అగంతకులు కిడ్నాప్ చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫైర్ విభాగంలో విధులు నిర్వహించే ఏఎస్ఐ సత్యనారాయణ కండపడ్డారు. అనుమానాస్పదంగా ఉన్న అగంతుకులును చూసిన ఏఎస్‌ఐ వారి దగ్గరకు వెళ్లాడు. అది గమనించిన అగంతకులు ఆ బాలుడిని వదిలి పారిపోయారు. దీంతో బాలుడిని అదుపుఉలోకి తీసుకున్న ఏఎస్‌ఐ.. ఈవో శీనా నాయక్ చైర్మన్ గాంధీ సమక్షంలో తప్పిపోయిన బాలుడి కోసం వెతుకుతున్న వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్ఐ సత్యనారాయణను దుర్గగుడి అధికారులు అభినందించారు.

వివరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య అనే మహిళ తన 4 ఏళ్ల బాలుడు శశి వజ్ర ఆరూష్‌తో కలిసి ఆదివారం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఏడవ అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరూష్ తల్లికి దూరమయ్యాడు. లావణ్య తన కుమారుడి కోసం మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కనపడకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే సమయంలో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్ఐ RV.సత్యనారాయణ అమ్మవారి దర్శనానికి వచ్చారు. లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒక బాలుడిని బలవంతంగా తీసుకెళ్తుండగా, ఆ బాలుడు గట్టిగా ఏడుస్తూ కనిపించాడు.

అనుమానం వచ్చిన ఏఎస్ఐ సత్యనారాయణ ఆ వ్యక్తులను ప్రశ్నించారు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు బాలుడిని వదిలి పారిపోయారు. ఇక బాలుడిని తన వద్దకు తీసుకున్న ఏఎస్ఐ సత్యనారాయణ, వెంటనే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీనివాస్ నాయక్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణను ఆశ్రయించి, జరిగిన విషయాన్ని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి, బాలుడి తల్లి లావణ్యను గుర్తించి, వారి సమక్షంలో బాలుడు శశి వజ్ర ఆరూష్‌ను తల్లికి సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో బాలుడిని కాపాడిన ఏఎస్ఐ కె.వి.సత్యనారాయణను ఆలయ ఈఓ, చైర్మన్ అభినందించారు. భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..