Amit Shah: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కుటుంబ సమేతంగా..
Amit Shah visits Srisailam: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి
Amit Shah visits Srisailam: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించున్న అనంతరం అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా.. స్వామి వార్ల దర్శనానికి వచ్చిన హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం హోంమంత్రి అమిత్ షా కుటుంబసభ్యులతో స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామి వార్ల దర్శన అనంతరం ఆలయ అధికారులు మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్ర పటాన్ని బహూకరించారు.
ఏపీ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: