AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: కన్నతల్లి కర్కశత్వం.. 14 రోజుల శిశువును దారుణంగా చంపిన తల్లి.. వాటర్ ట్యాంకులో పడేసి..

Mother killed 14-day-old baby: ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంలో.. ఏవేవో ఆలోచనలతో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకూ కొంతమంది

AP Crime: కన్నతల్లి కర్కశత్వం.. 14 రోజుల శిశువును దారుణంగా చంపిన తల్లి.. వాటర్ ట్యాంకులో పడేసి..
Mother Killed 14 Day Old Baby
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2021 | 12:11 PM

Share

Mother killed 14-day-old baby: ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంలో.. ఏవేవో ఆలోచనలతో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకూ కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. చికిత్స అనంతరం మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయనే కారణంతో.. తన 14 రోజుల బిడ్డను కడతేర్చింది. తన కన్నబిడ్డను ఆ తల్లి వాటర్ ట్యాంకులో పడేసి హత్యచేసింది. ఈ దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సాయి చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో బుధవారం రాత్రి జరిగింది. సాయి చిల్డ్రన్‌ ఆసుపత్రిలో మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్న పసికందు మృతదేహం వాటర్‌ట్యాంకులో లభ్యమైంది. కాగా స్నానానికి వెళ్లివచ్చే లోపు ఎవరో కావాలనే పాపను తీసుకెళ్లి వాటర్‌ ట్యాంకులో పడేసారని తల్లి రాత్రి పేర్కొంది. కాగా.. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని కొన్ని గంటల్లోనే చేధించారు.

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్‌ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో, పాలు తాగకపోవడంతో ఈనెల 8న ఏలూరు సాయి చిల్ట్రన్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో ఈఎన్‌టీ వైద్యునితో చికిత్స చేయిస్తున్నారు. అయితే.. చికిత్స అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భావించిన.. సీతామహాలక్ష్మి.. పసికందును వాటర్ ట్యాంకులో వేసి హత్యచేసింది.

యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో సీతామహాలక్ష్మి బాత్‌రూమ్‌కి వెళ్లినట్లు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తానే పాపను చంపినట్లు ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం పాప బతికున్నప్పటికీ.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఆమె తెలిపింది.

Also Read:

Kidnap And Murder Case: రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రముఖ బాబా అరెస్ట్..

Telangana Crime News: వృద్ధ దంపతుల మధ్య తెలెత్తిన ఘర్షణ.. భార్యని చంపి.. భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త