Kidnap And Murder Case: రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రముఖ బాబా అరెస్ట్..

Realter Bhaskar Reddy Murder Case: హైదరాబాద్‌లో రియల్టర్‌ విజయ్‌భాస్కర్ రెడ్డి మర్డర్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే.

Kidnap And Murder Case: రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రముఖ బాబా అరెస్ట్..
Nellore Realter Kidnap And Murder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2021 | 11:16 AM

Realter Bhaskar Reddy Murder Case: హైదరాబాద్‌లో రియల్టర్‌ విజయ్‌భాస్కర్ రెడ్డి మర్డర్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. రియల్టర్ హత్య వెనక ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో పోలీసులు కేసును ముమ్మరం చేశారు. అయితే ఆ ఆధ్యాత్మిక గురువును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ భాస్కర్ రెడ్డి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న త్రిలోక్‌నాథ్ బాబాను కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు కార్తీని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు.

విజయ్ భాస్కర్ రెడ్డి హాస్టల్‌ నుంచి అదృశ్యమయ్యాడంటూ నమోదైన ఈ కేసును పోలీసులు అనతి కాలంలోనే చేధించారు. అతడి హత్య వెనక ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భక్తులకు ప్రవచనాలతోపాటు రోగాలను కూడా నయం చేస్తానంటూ, విదేశాల నుంచి నిధులు వస్తాయంటూ పలువురు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఏపీ, తెలంగాణతోపాటు కర్నాటక, మహారాష్ట్రలో ఆశ్రమాలు తెరిచిన బాబా భక్తి చాటున ఎన్నో ఘోరాలు, నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో రియల్టర్ మర్డర్ తో ఈ స్వామీజీ నేర చరిత్ర మొత్తం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో కనిపించకుండా పోయిన రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి.. నెల్లూరులో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, విజయ్ భాస్కర్ ను పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి మర్డర్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి మర్డర్‌కు ఓ గురూజీయే ప్రధాన సూత్రధారని గుర్తించారు. కేవలం తనను అప్రతిష్టపాలు చేస్తున్నాడనే కారణంతోనే రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి కూడా గురూజీ మాటలు నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత డబ్బులు అడగడంతో కక్షతో.. బాబా త్రిలోక్‌నాథ్ సీని ఫక్కీలో హత్యచేయించాడు.

విజయ్‌భాస్కర్‌ రెడ్డిని హత్య చేసి నిందితులు హైదరాబాద్ నుంచి శ్రీశైలందారిలోని సున్నిపెంటకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సున్నిపెంట శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేసినట్లు నలుగురు నిందితులు ఒప్పుకొన్నారు. ఈ హత్య వెనుక త్రిలోక్‌నాథ్ బాబానే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గర్తించి.. పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేశారు.

Also Read:

Village Rancho: చదివింది ఎనిమిదే.. కానీ హెలికాఫ్టర్ తయారు చేశాడు.. చివరకు బ్లేడ్ తగిలి..

AP Crime: యువకుడి మృతికి కారణమైన కానిస్టేబుల్ సస్పెండ్.. ఎస్ఐపై కూడా వేటు..