Village Rancho: చదివింది ఎనిమిదే.. కానీ హెలికాఫ్టర్ తయారు చేశాడు.. చివరకు బ్లేడ్ తగిలి..
Village Rancho Builds Helicopter: ఆ కుర్రాడు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆ తర్వాత చదువు మానేసి తన అన్నయ్య షాపులో పనిచేయడం
Village Rancho Builds Helicopter: ఆ కుర్రాడు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆ తర్వాత చదువు మానేసి తన అన్నయ్య షాపులో పనిచేయడం ప్రారంభించాడు. 3 ఇడియట్స్.. సినిమా చూసి అచ్చం దానిలోని రాంచో పాత్రలా ఓ హెలికాప్టర్ తయారు చేయాలని కలలు కన్నాడు. చివరకు ఆ కుర్రాడు సొంతంగా హెలికాఫ్టర్ తయారు చేశాడు. దానికి మున్నా హెలికాఫ్టర్ అని పేరును సైతం పెట్టి.. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తన హెలికాఫ్టర్‌ను ప్రజలకు చూపించాలనుకున్నాడు. ఈ తరుణంలోనే అదే హెలికాఫ్టర్ రెక్క.. తన గొంతుకు తగిలి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా మహగావ్ తహసీల్‌లోని ఫుల్‌సవంగి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను తయారు చేయాలనుకున్న 24 ఏళ్ల షేక్ ఇస్మాయిల్ అదే విమానం బ్లేడ్ తెగడంతో దుర్మరణం చెందాడు.
మహగావ్ తాలుకా ఫుల్‌సవంగి గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ (24).. తన అన్నయ్య షేక్ ముసావిర్ వద్ద మెకానిక్‌గా గ్యాస్ వెల్డింగ్ షాపులో పని చేసుకుంటూ ఉండేవాడు. ఇస్మాయిల్‌కు విమానాల్లో ప్రయాణించడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. త్రీ ఇడియట్స్ సినిమా చూసి ఇస్మాయిల్ తానే సొంతంగా ఒక హెలికాప్టర్ తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా నిత్యం ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్‌ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల బ్లేడ్ తెగింది. దీంతో అది నేరుగా ఇస్మాయిల్ గొంతుకు తగిలింది. దీంతో అతని తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడని స్నేహితులు, పోలీసులు తెలిపారు. కాగా.. హెలికాఫ్టర్ ట్రయల్స్‌లో ఎప్పుడు హెల్‌మెట్, హెడ్‌ఫోన్ ధరించే ఇస్మాయిల్.. మంగళవారం మాత్రమే ధరించలేదని అతని స్నేహితులు తెలిపారు. దాదాపు ఛాపర్ ఐదడుగులు ఎత్తు ఎగిరిందని తెలిపారు.
హెలికాఫ్టర్ మరికాసేపట్లో గాల్లోకి ఎగురుతుందనగా ఈ ప్రమాదం జరిగినట్లు మరణించిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం స్నేహితులు తెలిపారు. ఇస్మాయిల్ ప్రయోగాన్ని కొంతమంది స్నేహితులు సెల్‌ఫోన్లల్లో కూడా చిత్రీకరించారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇస్మాయిల్ సోదరుడు.. ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా.. ఇస్మాయిల్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Young Sheikh Ismail from Fulsawangi in Yavatmal (Maharashtra) built a helicopter which he wanted to launch on Aug 15. The trial run became fatal for welder-turned-innovator on Tuesday ngt. Fondly called ‘Munna Helicopter’, he left inspiring memories behind. RIP, Dear Rancho. ? pic.twitter.com/EwG3IoS7w3
— Dharmendra Jore (@dharmendrajore) August 12, 2021
Also Read: