Philippines Earthquake: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన ఫిలిప్పీన్స్.. సునామీ అలెర్ట్..
Earthquake in Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం ఉదయం ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్‌లో
Earthquake in Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం ఉదయం ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్‌లో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతగా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజిక్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇంత భారీగా భూప్రకంపనలు రావడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. అయితే.. సునామీ వచ్చే అవకాశముందని పుకార్లు రావడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా.. సునామీ హెచ్చరికలను పలు ఏజెన్సీలు తోసిపుచ్చాయి. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి వార్తలు వెలువడలేదు.
మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్, హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సునామీ ప్రమాదం లేదని వెల్లడించింది. ఫిలిప్పీన్స్ సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేసింది. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఫిలిప్పీన్స్ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. కానీ ఇద్ద పెద్ద మొత్తంలో ప్రకంపనలు రావడం మరోసారి ఆందోళనకు గురిచేస్తుంది.
Also Read: