Andhra Pradesh: నిజమైన బాహుబలి మాల మస్టిలు.. ఈ సంచార తెగ బలం ఏనుగుల సాటి
బాహుబలి గా హీరో ప్రభాస్ వెండి తెరపై కనిపించగానే థియేటర్ మొత్తం ప్రేక్షకుల అరుపులతో దద్ధరిల్లి పోయింది. బాహుబలి... బాహుబలి అంటూ అశేష జనం సభలో అరుస్తూ ఉంటే సర్వసైన్యాధ్యక్షుడుగా అమరేంద్రబాహుబలి చేసిన ప్రమాణస్వీకారానికి అక్కడ భూమి కంపించి పోవటం చిత్రీకరణలో చూశాం. కాని నిజంగా ఒళ్ళు గగుర్పాటు కు గురిచేసే విన్యాసాలు, ఎవరూ చేయలేని సాహసాలను తరతరాలుగా చేస్తున్న వారే

మాల మాస్టి కళాకారులు. వీరు యాభై కేజీల రాయి అవలీలగా పైకి విసిరేసారు. అదే రాయిని గాల్లోకి విసిరేసి తమ ఛాతి, భుజాలు అడ్డుపెడతుంటారు. పొట్టేలును డీ కొట్టడం, ట్రాక్టర్లను లాక్కు వెళ్లటం ఇలా ఒకటి కాదు రెండు కాదు వీళ్లు చేసే విన్యాసాలు చాలా ఆకట్టుకుంటాయి. కళ్లార్పకుండా చూసి మంత్రముగ్ధులు కావాల్సిందే. సంచార తెగకు చెందిన మాల మస్టిలు తూర్పు గోదావరి జిల్లా పరిసరాల్లో సుమారు 500ల కుటుంబాలు వరకు ఉన్నాయి. పూర్వం నుంచి వీరు ఊరూరు తిరుగుతూ తమ విద్యను ప్రదర్శిస్తుంటారు. అక్కడ ప్రజలు ఇచ్చే బహుమతులు తీసుకుని స్ధానికులు చేసే దాన ధర్మాల ద్వారా వచ్చిన డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించు కుంటారు.
వీరు సంచార జీవులుగా ఉండటంతో చదువు కున్న వారు తక్కువ. ఈ తరం లో కొందరు తమ పిల్లలకు చదువు లు చెప్పి స్తున్నారు. ఇలాంటి కళాకారులు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 800 మంది వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో కొందరు పాటలు సైతం చక్కగా పాడతారు. తాజాగా వీరు నిడదవోలు మండలం సమిశ్రిగూడెంలో చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








