గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. ఈ సమస్యలున్నవారికి మాత్రం విషంతో సమానం.. తస్మాత్ జాగ్రత్త
రోజు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి ఇది ప్రభుత్వం కూడా ప్రజలకు చెబుతోంది. ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి గుడ్లు తీసుకుంటారు. అంతేకాదు గుడ్డులో అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కనుక రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్డు తినడం అందరికీ ఆరోగ్యకరం కాదు.. కొంతమంది గుడ్లు తినొద్దు ఎందుకంటే

గుడ్డు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా తినే ఒక సాధారణ ఆహారం. దీనిలోని తెలుపు, పసుపు భాగాలు రెండూ అనేక పోషకాలతో నిండి ఉన్నాయి. గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరుగా ఉండటమే కాదు, ఐరెన్, B12 , ఇతర విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. పెరుగుతున్న పిల్లలు, అధిక శక్తి అవసరమయ్యే వ్యక్తులు, అథ్లెట్లు దీనిని తీసుకుంటారు. ఎందుకంటే గుడ్లు కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి, కంటి చూపు, రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పోషకాలు ముఖ్యమైనవి. ఒక వయోజనుడు సమతుల్య ఆహారంలో ఒకటి నుంచి రెండు గుడ్లను చేర్చుకోవచ్చు. అయితే కొంత మంది కొన్ని పరిస్థితులలో.. గుడ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.
ఉడికించి తినడంనుంచి స్పైసీ ఆమ్లెట్, సగం ఉడికించిన గుడ్లు మొదలైన అనేక రకాలుగా గుడ్డుతో వంటకాలు తయారు చేస్తారు. అందుకే చాలా మంది గుడ్లు తినడానికి ఇష్టపడతారు. కొంతమంది కండరాల బలం కోసం గుడ్లు తింటారు. గుడ్లు పెద్ద ఖరీదైనవి కావు. మంచి పోషకాలను కూడా అందిస్తాయి. ఈ రోజు ఎటువంటి వ్యక్తులు గుడ్లు తినకూడదో తెలుసుకుందాం..
కిడ్నీ సమస్యలు ఉంటే తినవద్దు మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే గుడ్లు తినకూడదు లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే గుడ్లను తినే ఆహారంలో వాటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. లేకుంటే అది మీకు హాని కలిగించవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్లు తినవద్దు చెడు కొలెస్ట్రాల్ గుండెకు పెద్ద శత్రువు. గుడ్డులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక గుడ్డు వినియోగం కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కనుక అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్లు తినవద్దు. ముఖ్యంగా గుడ్డులోని పసుపు భాగాన్ని అంటే పచ్చసొనను తినకూడదు.
అలెర్జీలు ఉన్నవారు గుడ్లు తినవద్దు కొంతమందికి గుడ్లు అలెర్జీగా ఉంటాయి. అలెర్జీ ఉన్నవారు గుడ్లు తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గుడ్లు తిన్న తర్వాత ఎవరికైనా సాధారణంగా కడుపు నొప్పి, వికారం, వాంతులు మొదలైన సమస్యలు వస్తే దానికి కారణం గుడ్లు అలెర్జీ కావచ్చు. అందువల్ల అలెర్జీ సమస్య ఉన్నవారు ముందుగా వైద్యుడితో మాట్లాడాలి.
లావుపాటి వారు గుడ్లు తినవద్దు గుడ్డు ప్రోటీన్ మూలం అయినప్పటికీ.. ఎవరైనా ఊబకాయంతో బాధపడుతుంటే గుడ్డని తినొద్దు. ఎందుకంటే మీరు బరువు మరింత పెరగవచ్చు. అయితే వ్యాయామం చేస్తుంటే గుడ్లు తినవచ్చు, కానీ గుడ్డులోని పసుపు సొనని తినొద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




