Chanakya Niti: మీరు పదేపదే మోసపోతున్నారా.. చాణక్య చెప్పిన ఈ విషయాలను పాటించండి..
ఆచార్య చాణక్యుడు అధ్యాపకుడు. రాజనీతిజ్ఞుడు. ఒక సాధారణ యువకుడిని రాజుగా మార్చిన అపార తెలివి తేటలున్నవ్యక్తి. ఆచార్య చాణక్య రచించిన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు. వీటిని మన జీవితంలో స్వీకరించినట్లయితే.. మనం మోసపోకుండా ఉండటమే కాదు.. జీవితాన్ని తెలివిగా జీవించగలరు. మిమ్మల్ని మళ్లీ మళ్లీ మోసపోకుండా కాపాడే చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.

కొంత మంది జీవితంలో ద్రోహం చేసే వ్యక్తులు ఉంటారు. ఎటువంటి బంధం అయినా నమ్మి అన్ని విషయాలను పంచుకుంటారు. అది స్నేహం అయినా, సంబంధాలు అయినా లేదా వ్యాపారం అయినా చాలా సార్లు మనస్ఫూర్తిగా నమ్ముతారు. అయితే కొంతమంది నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ద్రోహం చేస్తే తరువాత బాధపడతారు. అలాంటి సమయాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాదు. గొప్ప ఆలోచనాపరుడు ఆచార్య చాణక్యుడు జీవిత అనుభవాలకు సంబంధించిన విధానాలను మానవులకు అందించాడు. అయితే అవి నేటికీ మానవులకు అనుసరణీయం. చాణక్య చెప్పిన విషయాలను జీవితంలో అనుసరిస్తే మోసపోకుండా మనల్ని మీరు రక్షించుకోవడమే కాదు జీవితాన్ని సంతోషంగా లీడ్ చేయగలరు. ఈ రోజు మీరు మళ్లీ మళ్లీ మోసపోకుండా కాపాడే చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.
ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. తెలిసిన ప్రతి ఒక్కరినీ నమ్మవద్దు. అంటే అందరినీ పూర్తిగా నమ్మడం అవివేకం అని చాణక్యుడు చెప్పాడు. కొంతమంది బయటి నుంచి చాలా మంచిగా కనిపిస్తారు. అయితే వారి ఉద్దేశాలు తప్పు కావచ్చు. మీకు ఎవరినైనా బాగా తెలియని వ్యక్తితో ఏ విషయం చెప్పవద్దు. గుడ్డిగా నమ్మి ప్రతిదీ పంచుకోవడం వలన తర్వాత మోసం చేసే అవకాశం ఉంది. కనుక ఎవరినైనా నమ్మే ముందు వారి గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నమ్మండి.
మీ బలహీనతలను ఎవరికీ చెప్పకండి. ప్రతి ఒక్కరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. మీ బలహీనతను నమ్మిన వ్యక్తులకు చెబితే.. వాటిని అవతల సద్వినియోగం చేసుకోవచ్చు. కనుక మీకున్న బలహీనతలను రహస్యంగా ఉంచుకోవడం తెలివైన పని అని చాణక్యుడు చెప్పాడు. దీనితో మీరు ఎల్లప్పుడూ ఇతరుల దృష్టిలో బలమైన వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తులుగా గుర్తింపుతో ఉంటారు.
అనవసరమైన భావోద్వేగాలకు లోనవడం మంచిది కాదు. భావోద్వేగాలు మనిషికి ముఖ్యమైనవే కానీ వాటిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం అంతకంటే ముఖ్యం. చాలా సార్లు మన భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. కనుక భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని తెలివిగా ప్రవర్తించాలి. ఏదైనా పని చేసే ముందు తెలివిగా మెదడుకి పదుని పెట్టి ఆలోచించాలి.. అంతేకాని హృదయంతో మాత్రం ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవద్దు.
అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించవద్దు అని చాణక్య నీతి చెబుతుంది. ఇలా చేయడం వల్ల మీరు అసంతృప్తి చెందుతారు. అంతేకాదు అందరినీ సంతోష పెట్టడం కోసం తనని తాను తగ్గించుకునే వ్యక్తులను ప్రజలు చులకనగా చూస్తారు. తేలికగా తీసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








