AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు గోర్లు కత్తిరించుకుంటే దరిద్రం పట్టుకుంటుందా.. ? ఏ రోజు కట్ చేసుకోవాలంటే..

హిందూ మతంలో గోర్లు కత్తిరించడానికి సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏ రోజు గోర్లు కత్తిరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది .. ఏ రోజు గోర్లు కత్తిరించకూడదు అనే విషయంపై కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ రోజు గోర్లు ఏ రోజు కత్తిరించడానికి ఉన్న నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

ఆ రోజు గోర్లు కత్తిరించుకుంటే దరిద్రం పట్టుకుంటుందా.. ? ఏ రోజు కట్ చేసుకోవాలంటే..
Hindu Nail Cutting Rules
Surya Kala
|

Updated on: May 27, 2025 | 4:25 PM

Share

హిందూ మతంలో ప్రతిదానికీ సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. గోర్లు కత్తిరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. పెద్దలు తరచుగా రాత్రిసమయంలో మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక రోజులలో గోర్లు కత్తిరించడంపై కూడా నిషేధం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో లేదా రాత్రి సమయంలో గోళ్లను ఎప్పుడూ కత్తిరించకూడదు. దీని వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. ఏ రోజుల్లో గోర్లు కత్తిరించకూడదో.. ఏ రోజుల్లో గోర్లు కత్తిరించడం శుభప్రదమో ఈ రోజు తెలుసుకుందాం..

ఏ రోజు పొరపాటున కూడా గోళ్లను కత్తిరించవద్దంటే

మంగళవారం: జ్యోతిషశాస్త్రం ప్రకారం మంగళవారం గోర్లు కత్తిరించడం నిషేధించబడింది. మంగళవారం గోర్లు కత్తిరించడం వల్ల అప్పులు పెరుగుతాయని, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని నమ్ముతారు. ముఖ్యంగా హనుమంతుడిని పూజించి ఉపవాసం ఉండేవారు ఈ రోజున గోర్లు కత్తిరించకూడదు.

గురువారం: గురువారం గోర్లు కత్తిరించడం కూడా నిషేధించబడింది. గురువారం రోజున గోళ్లు కత్తిరించడం వల్ల వైవాహిక సంబంధాలలో విభేదాలు ఏర్పడతాయని, భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

శనివారం: శనివారం కూడా గోర్లు కత్తిరించకూడదు. జాతకంలో శని బలహీనంగా ఉన్న వ్యక్తులు శనివారం గోర్లు కత్తిరించడం వల్ల మానసిక , శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. దీనివల్ల ఆర్థిక నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది.

ఆదివారం: ఆదివారం గోర్లు కత్తిరించడం వల్ల పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. విజయాన్ని కూడా అడ్డుకుంటుంది. ఆదివారం గోర్లు కత్తిరించడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కనుక ఈ రోజున గోర్లు కత్తిరించకూడదు.

ఏ రోజున గోర్లు కత్తిరించాలంటే

సోమవారం: జ్యోతిషశాస్త్రంలో సోమవారం గోర్లు కత్తిరించడం మంచిదని భావిస్తారు. ఈ రోజున గోర్లు కత్తిరించుకోవడం వల్ల అజ్ఞానం, పాపం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. సోమవారం శివుడు, చంద్రుడు , మనస్సుతో ముడిపడి ఉంది.

బుధవారం: దీనితో పాటు బుధవారం కూడా గోర్లు కత్తిరించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. బుధవారం గోర్లు కత్తిరించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని, పురోగతికి మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు. దీని వలన వ్యాపారంలో ఆదాయం కూడా పెరుగుతుంది.

శుక్రవారం: శుక్రవారం గోర్లు కత్తిరించుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున గోర్లు కత్తిరించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని, జీవితంలో సంపద, శ్రేయస్సు , అందం పెరుగుతుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..