- Telugu News Photo Gallery Spiritual photos Bedroom Vastu for Couples: Attract Happiness and Prosperity
Vastu Tips for Bedroom: కొత్త జంట బెడ్ రూమ్ లో ఈ వస్తువులను పెట్టుకుంటే బంధం బలపడుతుందట..
ఇంట్లో బెడ్ రూమ్ కోసం కూడా వాస్తు చిట్కాలు పాటించాలి. ఇలా చేయడం వలన సుఖ నిద్ర, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించుకోవచ్చు. వాస్తు ప్రకారం బెడ్‌రూమ్ నైరుతి దిశలో ఉండటం మంచిది. తూర్పు లేదా ఉత్తర దిశలో ఎక్కువ కిటికీలు, గోడలు ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ బెడ్ రూమ్ నూతన వధూవరులకు కేవలం విశ్రాంతి తీసుకునే స్థలం మాత్రమే కాదు.. పవిత్ర బంధానికి కేంద్రం. కనుక బెడ్ రూమ్ లో కొన్ని రకాల వస్తువులను వాస్తు ప్రకారం సరైన స్థలంలో ఉంచినట్లయితే. నవ దంపతుల జీవితం సుఖ సంతోషాలతో ప్రారంభం అవుతుందట.
Updated on: May 27, 2025 | 5:11 PM

వాస్తు శాస్త్రం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఇంటి ఆనందం, శాంతి , శ్రేయస్సుకు మార్గనిర్దేశం చేస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు ఉండే బెడ్ రూమ్ లో ఉండే వాతావరణం ప్రేమ, సామరస్యం ,సానుకూల శక్తితో నిండి ఉండాలి. ఆధ్యాత్మిక దృక్కోణంలో కూడా.. నవ దంపతుల జీవితం మొదలు పెట్టే సమయం చాలా సున్నితమైనది. జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే సమయం. కనుక నవ దంపతులు ఉండే బెడ్ రూమ్ లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వాస్తు ప్రకారం సరైన దిశలో, సరైన స్థానంలో ఉంచినట్లయితే.. వివాహ జీవితంలో ప్రేమ, అవగాహన, శ్రేయస్సు ఉంటాయి. కొత్త జంటలు తమ బెడ్ రూమ్ లో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

రాధా-కృష్ణుల విగ్రహం లేదా చిత్రం: సనాతన ధర్మంలో రాధా-కృష్ణుల ప్రేమ శాశ్వతమైనది. ఆదర్శవంతమైనదిగా పరిగణించబడుతుంది. బెడ్ రూమ్ లోని ఈశాన్య దిశలో రాధాకృష్ణుల విగ్రహం లేదా అందమైన చిత్రాన్ని ఉంచడం ద్వారా.. వైవాహిక జీవితంలో ప్రేమ, మాధుర్యం ,సామరస్యం నిలిచి ఉంటాయి. అయితే రాధా-కృష్ణుల విగ్రహం కూర్చున్న స్థితిలో ఉండాలి. అంతేకాదు పెద్దదిగా కూడా ఉండకూడదని గుర్తుంచుకోండి.

సువాసనగల ధూపం లేదా సహజ పరిమళం: అగరుబత్తులు , పరిమళ ద్రవ్యాలు వాతావరణాన్ని సువాసనగా మార్చడమే కాదు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుతాయి. ముఖ్యంగా గంధపు చెక్క, మొగలి పువ్వు లేదా గులాబీల సువాసనలు బెడ్ రూమ్ లోని వాతావరణాన్ని ప్రశాంతంగా, ప్రేమగా , సానుకూలంగా మారుస్తాయి. వాస్తు ప్రకారం ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన శక్తిని తెస్తాయి.

క్రిస్టల్ బాల్ లేదా రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్: రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ప్రేమ, భావోద్వేగ సమతుల్యతకు చిహ్నంగా నమ్ముతారు. బెడ్ రూమ్ లోని నైరుతి దిశలో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధం పెరుగుతుంది. క్రిస్టల్ బాల్ శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. జీవితంలో మాధుర్యాన్ని తెస్తుంది.

తాజా పువ్వుల గుత్తి: హిందువులు పువ్వులను శుభం, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ప్రతిరోజూ బెడ్‌రూమ్‌లో తాజా పువ్వులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పర్యావరణం సున్నితంగా, సానుకూలంగా ఉంటుం

ఏడు గుర్రాల చిత్రం: వాస్తు శాస్త్రంలో ఏడు గుర్రాల చిత్రాన్ని పురోగతి, శక్తి,విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ చిత్రాన్ని బెడ్ రూమ్ తూర్పు దిశలో ఉంచడం శుభప్రదం. జీవితంలో వేగం, సామరస్యం, లక్ష్యాలను సాధించడంలో ఇది సహాయకరంగా పరిగణించబడుతుంది.




