- Telugu News Photo Gallery Spiritual photos Top 5 Lucky Zodiac Signs in June 2025: Financial Gains and Career Growth Details in Telugu
June Lucky Zodiac Signs: ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం.. జూన్ నుంచి దశ తిరిగినట్టే..!
Lucky Zodiac Signs in June 2025: మేలో రాశి మార్పు చెందిన నాలుగు ప్రధాన గ్రహాల ఫలితాలు జూన్ నుంచి పూర్తి స్థాయిలో అనుభవానికి రావడం ప్రారంభిస్తాయి. గురువు, రాహువు, కేతువు, బుధుడు, రవి, శుక్రుడు మే నెలలో రాశులు మారగా, జూన్ మొదట్లో కుజ, బుధ, రవులు మారడం జరుగుతోంది. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల జూన్ నెలంతా కొన్ని రాశుల వారికి సంచలనాలు జరిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు రాశుల వారి దశ తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభాలు, ఆస్తి వివాదాల పరిష్కారం, పదోన్నతులు, సంతాన ప్రాప్తి, ఆదాయ వృద్ధి, మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరడం వంటివి జరిగే అవకాశం ఉంది.
Updated on: May 27, 2025 | 6:56 PM

మేషం: ఈ రాశివారికి అయిదు గ్రహాలు అనుకూలంగా మారడం జరుగుతోంది. దీని ఫలితంగా జూన్ నెలంతా ఈ రాశివారికి నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు.

వృషభం: ఈ రాశికి ఏకంగా ఆరు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల విపరీత రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. అనేక విషయాల్లో అదృష్టం తలుపు తడుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

సింహం: ఈ రాశికి అయిదు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నమూ ఆశించిన లాభాలనిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలు వంద శాతం విజయవంతం అవుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు.

తుల: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు బాగా అనుకూల ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంటపండుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. రావలసిన సొమ్మంతా తప్పకుండా చేతికి అందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి ఆరు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల నెలంతా నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లి, సంపాదించడం జరుగుతుంది.



