- Telugu News Photo Gallery Spiritual photos If you have a mole on these organs, luck will be with you
Moles on Body: మీకు ఈ అవయవాలపై పుట్టుమచ్చ ఉందా.? అదృష్టం మీ వెంటే..
శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టు మచ్చలు ఉంటే కలిసి వస్తాయి. అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి సముద్ర శాస్త్రం ప్రకారం.. ఏయే అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.? ఇప్పుడు మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం పదండి..
Updated on: May 28, 2025 | 1:56 PM

శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టు మచ్చలు ఉంటే కలిసి వస్తాయి. అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి సముద్ర శాస్త్రం ప్రకారం.. ఏయే అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చెంపపై పుట్టు మచ్చ ఉండటం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి.

ఛాతీ మధ్యలో పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులుగా సముద్ర శాస్త్రం చెబుతుంది. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే నాభిపైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చు ఉంటే.. అది కూడా శుభ సంకేతంగా చెబుతారు.

సముద్ర శాస్త్రం ప్రకారం.. పుట్టుమచ్చలు నుదిటిపై ఉంటే.. దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు.. ధన కొరతను ఎప్పుడూ చూడరు. అదృష్టం వరిస్తుంది. అదే విధంగా గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా శుభమే.

అదే విధంగా సముద్ర శాస్త్రం ప్రకారం ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే.. ఈ వ్యక్తి బాగా సంపాదిస్తాడని అర్థం. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే.. అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందట.




