AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రాన్ని టీతో స్నాక్ తినాలంటే… మొక్కజొన్న పకోడాలు ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం

మొక్కజొన్న గింజలు, వేర్లు, కాండం , పీచు కూడా రకరకాలుగా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా మొక్కజొన్నను తినే ఆహారంగా ఉపయోగిస్తారు. గింజలను ఉడికించి, కాల్చి, లేదా రకరకాలుగా ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. మొక్కజొన్న గింజలతో పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ వంటి స్నాక్స్ పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అయితే మీరు మొక్కజొన్న ప్రియులైతే.. డిఫరెంట్ గా ఆహారాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటే మొక్కజొన్న పకోడా ట్రై చేయండి. ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. రెసిపీ మీ కోసం

సాయంత్రాన్ని టీతో స్నాక్ తినాలంటే... మొక్కజొన్న పకోడాలు ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం
Corn Pakoda
Surya Kala
|

Updated on: May 27, 2025 | 7:27 PM

Share

మొక్కజొన్న పకోడా చాలా రుచికరమైన .,. క్రిస్పీ స్నాక్ ఐటెం. దీనిని తిన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇష్టపడతారు. వర్షాకాలంలో లేదా సాధారణ రోజు అయినా.. ఈ మొక్కజొన్న పకోడీలు టీతో తినడానికి చాలా బాగుంటాయి. దీని రుచి, తాజాదనం అందరినీ ముఖ్యంగా పిల్లలను ఆకర్షిస్తుంది. ఎప్పుడైనా త్వర త్వరగా రుచికరంగా ఏదైనా చిరుతిండిని చేసుకోవాలని భావిస్తే మొక్కజొన్న పకోడా అత్యంత సులభమైన, రుచికరమైన ఎంపిక. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అంతేకాదు దీనిని తయారు చేసుకునెందుకు కావాల్సిన పదార్థాలు సాధారణంగా మీ ఇంట్లో దొరుకుతాయి. ఇంట్లో మొక్కజొన్న పకోడా తయారుచేసే రెసిపీని తెలుసుకుందాం.

మొక్కజొన్న పకోడి తయారీకి కావలసిన పదార్థాలు

మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పులు (ఉడికించినవి)

శనగపిండి – 1/2 కప్పు

ఇవి కూడా చదవండి

బియ్యం పిండి – అర కప్పు

పచ్చిమిర్చి – 1-2 (సన్నగా తరిగినవి)

అల్లం – 1 అంగుళం ముక్క (తురిమినది)

కొత్తిమీర – 2 టీస్పూన్లు (సన్నగా తరిగినవి)

వాము- 1/4 టీస్పూన్

పసుపు – 1/4 స్పూన్

కారం – 1/2 స్పూన్

ఉప్పు- రుచికి సరిపడా

నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం: ముందుగా ఉడికించిన మొక్కజొన్న గింజలలో ఒక కప్పు గింజలను బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని రుబ్బుకున్న మొక్కజొన్న గింజల పిండిని.. మిగిలిన గింజలను వేయండి. తరువాత శనగపిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, వాము, పసుపు, కారం, ఉప్పు వేసి అన్నీ బాగా కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మొక్క జొన్న పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని వేడి ఎక్కినా నూనెలో వేయండి. మీడియం మంట మీద ఈ పకోడీ బంగారు గోధుమ రంగులోకి వచ్చి.. క్రిస్పీగా మారే వరకు వేయించాలి. వేగిన పకోడీలను కిచెన్ పేపర్‌పై తీసుకోండి. అంతే హాట్ కార్న్ పకోరాలు సిద్ధం. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమోటా సాస్ తో సర్వ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..