TV9 & KAB Education Expo 2025: మే 31, జూన్ 1 తేదీల్లో విజయవాడ, వైజాగ్‌లో మెగా TV9 ఎడ్యుకేషన్ ఫెయిర్.. ఎంట్రీ ఫ్రీ!
గత వారం హైదరాబాద్‌లో టీవీ9 నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్ పో 2025 కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యకు సంబంధించి కెరీర్ గైడెన్స్ తీసుకునేందుకు పోటెత్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఇప్పుడు.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025 నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి..

విజయవాడ, మే 27: TV9 నెట్‌వర్క్, KAB సంయుక్తంగా గత వారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్ పో 2025 కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యకు సంబంధించి కెరీర్ గైడెన్స్ తీసుకునేందుకు పోటెత్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఇప్పుడు.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025 నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవాడ, వైజాగ్‌లలోనూ నిర్వహించనున్న ఈ ఎక్స్‌పోకు విద్యార్థులు హాజరై తమ భవిష్యత్తుకు ఉన్నత మార్గాలను అన్వేషించడానికి, కెరీర్ ప్లానింగ్‌కు అవకాశం కల్పిస్తుంది. మే 31, జూన్ 1 తేదీలలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
మే 31న విజయవాడలోని SS కన్వెన్షన్ సెంటర్‌లో, జూన్ 1న వైజాగ్‌లోని VUDA చిల్డ్రన్స్ అరీనాలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ దేశంలో, విదేశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగిస్తాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఏ కోర్సు తీసుకోవాలో? ఏ కాలేజీ బెస్ట్? ఉన్నత శిఖరాలకు ఏది ఉత్తమమైన కోర్సు? వంటి మరెన్నో వివరాలు పొందడానికి విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం. అంతేకాకుండా ప్రవేశ పరీక్షలు, కళాశాలల అడ్మిషన్లు, కెరీర్ సూచికలకు నిపుణులు మార్గనిర్దేశం చేస్తారు.
ఇంటర్మీడియట్ (12వ తరగతి), డిప్లొమా విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే ఎవరికైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కామర్స్, లా, మెడిసిన్, ఫార్మసీ, యానిమేషన్, ఆర్ట్స్, సైన్స్, మీడియా అండ్ జర్నలిజం వంటి మరెన్నో స్పెషలైజేషన్లలో అధిక డిమాండ్ ఉన్న కోర్సుల వివరాలు, అధ్యయన మెథడ్స్, ఎడ్యుకేషన్ ట్రెండ్స్‌పై స్పష్టమైన అవగాహన కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల పూర్తి సమాచారం కూడా అందిస్తారు.
AP-EAPCET, NEET, JEE, ICET, JoSAA వంటి కీలక ప్రవేశ పరీక్షల వెబ్ కౌన్సెలింగ్‌కు నిపుణుల సలహాలు పొందొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న విదేశీ ప్రవేశాలు, పరీక్షలు, స్కాలర్‌షిప్‌లకు కూడా విదేశీ విద్యా సలహాదారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ట్రెండింగ్ కోర్సులు,పరిశ్రమ-సంబంధిత కార్యక్రమాలు, దీర్ఘకాలిక కెరీర్ ప్రణాళికపై నిపుణుల సలహాలను వ్యక్తిగతంగా పొందొచ్చు. ఈ ఈవెంట్లకు హాజరయ్యే వారందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితం. కాగా TV9 నెట్‌వర్క్ దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో గత పదేళ్లలో 15 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యా, కెరీర్ అంశాలపై మార్గనిర్దేశం చేస్తుంది.
తేదీల వారీగా ఎడ్యుకేషన్ ఫెయిర్ వివరాలు
మే 31న విజయవాడలో ఎక్స్‌పో ఈవెంట్
- వేదిక: SS కన్వెన్షన్ సెంటర్
- సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు
- ప్రవేశం పూర్తిగా ఉచితం
జూన్ 1న వైజాగ్‌లో ఎక్స్‌పో ఈవెంట్
- వేదిక: VUDA చిల్డ్రన్స్ అరీనా
- సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు
- ప్రవేశం అందరికీ పూర్తిగా ఉచితం
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




