AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC FRO Exam 2025: ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష తేదీలివే.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు!

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు జూన్‌ 6 నుంచి 26 మధ్య వేర్వేరు తేదీల్లో జరగాల్సి ఉండగా.. ఈ పరీక్షలన్నీ తాజాగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (FRO) మెయిన్స్‌ పరీక్షకు మాత్రం ఎలాంటి అడ్డులేకపోవడంతో ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది..

APPSC FRO Exam 2025: ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష తేదీలివే.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు!
APPSC FRO Exam
Srilakshmi C
|

Updated on: May 27, 2025 | 5:05 PM

Share

అమరావతి, మే 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPSC) పలు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్‌ 6 నుంచి 26 మధ్య వేర్వేరు తేదీల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఈ పరీక్షలన్నింటినీ వాయిదా వేసింది. అయితే ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (FRO) మెయిన్స్‌ పరీక్షకు మాత్రం ఎలాంటి అడ్డులేకపోవడంతో ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ పరీక్ష హాల్‌టికెట్స్‌ను కూడా విడుదల చేసింది.

అభ్యర్థులు తమ ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌంన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షలు జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు ఓఎంఆర్‌ ఆధారంగా ఆఫ్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. కాగా గత ఏడాది 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది.

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ హాల్‌టికెట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

జూన్‌ 1న తెలంగాణ ఎడ్‌సెట్‌ 2025.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సులో ప్రవేశాలకు టీజీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2025 ప్రవేశ పరీక్ష జూన్ 1న నిర్వహించనుంది. ఈ పరీక్ష హాల్‌టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్ష హాల్‌ టికెట్లను తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌ 1న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. మొదటి సెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరగనుంది.

తెలంగాణ ఎడ్‌సెట్‌ 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!