జగన్ సంచలన నిర్ణయం.. ‘ప్రజావేదిక’ కూల్చివేత
ఇన్నిరోజులు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ప్రధాన వివాదంగా మారిన ప్రజావేదికకు ఇక ‘నూకలు చెల్లినట్లే’. మరో రెండు రోజుల్లో అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అవినీతి, దోపిడిని తమ ప్రభుత్వం సహించదని, అక్రమంగా నిర్మించిన ప్రజావేదికలో సమావేశం కావాల్సిన దుస్థితి పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దీనిని నిర్మించారని.. అవినీతి ఏ విధంగా జరిగిందో చూపాలనే ప్రజావేదికలో […]
ఇన్నిరోజులు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ప్రధాన వివాదంగా మారిన ప్రజావేదికకు ఇక ‘నూకలు చెల్లినట్లే’. మరో రెండు రోజుల్లో అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అవినీతి, దోపిడిని తమ ప్రభుత్వం సహించదని, అక్రమంగా నిర్మించిన ప్రజావేదికలో సమావేశం కావాల్సిన దుస్థితి పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దీనిని నిర్మించారని.. అవినీతి ఏ విధంగా జరిగిందో చూపాలనే ప్రజావేదికలో సదస్సు నిర్వహించామని పేర్కొన్నారు.