ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 60 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె చెప్పారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి. కాగా ద్వితీయ సంవత్సర ఫలితాల్లో […]
అమరావతి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 60 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె చెప్పారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి. కాగా ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 13,966 మందికి, సెకండియర్‌లో 9,340 మంది విద్యార్థులకు 10కి 10 గ్రేడ్‌లు వచ్చాయి. మే 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.