మనుమడితో ఆటలాడుతున్న సీఎం చంద్రబాబు

అమరావతి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో సీఎం చంద్రబాబు రిలాక్స్ అవుతున్నారు. నిత్యం రాజకీయాలలో బిజిబిజీగా ఉండే సీఎం చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మనుమడు దేవాన్ష్ తో సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో దేవాన్ష్‌తో పోటీపడుతూ పరుగులు తీశారు. ఈ సరదా సన్నివేశాన్ని ఫోటో తీసిన మంత్రి లోకేష్.. తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచార సభలలో పాల్గొన్న @ncbn […]

మనుమడితో ఆటలాడుతున్న సీఎం చంద్రబాబు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 10, 2019 | 9:52 PM

అమరావతి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో సీఎం చంద్రబాబు రిలాక్స్ అవుతున్నారు. నిత్యం రాజకీయాలలో బిజిబిజీగా ఉండే సీఎం చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మనుమడు దేవాన్ష్ తో సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో దేవాన్ష్‌తో పోటీపడుతూ పరుగులు తీశారు. ఈ సరదా సన్నివేశాన్ని ఫోటో తీసిన మంత్రి లోకేష్.. తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచార సభలలో పాల్గొన్న @ncbn గారికి, కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతామనవళ్ళు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు తెలుగునాట వైరల్‌గా మారింది.