AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటగదిలో ఉండకూడని వస్తువులు ఇవే.. వెంటనే తీసేయ్యకపోతే దరిద్రం తాండవం చేయడం ఖాయం..

Vastu Tips: మీరు ఎంత సంపాదిస్తున్నా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవడం లేదా? ఇంట్లో కారణం లేకుండానే గొడవలు జరుగుతున్నాయా? అయితే మీ వంటగదిలో ఏదో దోషం ఉన్నట్లే.. వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంటి అదృష్టం వంటగది నుంచే మొదలవుతుంది. కానీ మనకు తెలియకుండానే అక్కడ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు.. సాక్షాత్తూ ఆ లక్ష్మీ దేవిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా చేస్తాయి.

వంటగదిలో ఉండకూడని వస్తువులు ఇవే.. వెంటనే తీసేయ్యకపోతే దరిద్రం తాండవం చేయడం ఖాయం..
Vastu Tips For Kitchen
Krishna S
|

Updated on: Feb 09, 2026 | 7:28 PM

Share

మన ఇంట్లో అన్నింటికంటే ముఖ్యమైన ప్రదేశం వంటగది. ఇది కేవలం ఆకలి తీర్చే చోటు మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరికీ శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే పవిత్ర నిలయం. వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగదిలో ఉండే శక్తులు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అక్కడ ప్రతికూల శక్తి ఉంటే మనం ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు చుట్టుముడతాయి. మీ వంటగదిలో ప్రతికూలతను పెంచే ఆ 4 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మిగిలిపోయిన పాత ఆహారం

వంటగదిలో ఎప్పుడూ పాతబడిన లేదా పాడైపోయిన ఆహారాన్ని ఉంచకూడదు. భోజనం తర్వాత ఆహారం మిగిలితే దానిని అవసరమైన వారికి దానం చేయాలి లేదా ఆవుకు తినిపించాలి. ఆహారాన్ని అవమానించడం అంటే అన్నపూర్ణ దేవిని అవమానించడమే. ఇంట్లో తరచుగా నిల్వ ఆహారం ఉంటే అది ప్రతికూలతను పెంచి, మనశ్శాంతిని దూరం చేస్తుంది.

విరిగిన పాత్రలు

చాలామంది చిల్లులు పడిన లేదా స్వల్పంగా పగిలిన పాత్రలను పారేయలేక వాడుతుంటారు. విరిగిన, పగిలిన లేదా అంచు పోయిన పాత్రలను వెంటనే వంటగది నుండి తొలగించాలి. ఇవి ఇంట్లో వాస్తు దోషం కలిగిస్తాయి. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతుంది.

ఇవి కూడా చదవండి

మురికి పాత్రలు

వంట పూర్తయిన తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత గిన్నెలను గంటల తరబడి సింక్‌లో అలాగే ఉంచే అలవాటు ఉందా.. మురికి పాత్రలను అలాగే వదిలేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట మురికి పాత్రలను కడగకుండా అస్సలు పడుకోకూడదు. తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వంటగదిలో చెత్తాచెదారం

వంటగదిని ఊడ్చినప్పుడు లేదా శుభ్రం చేసినప్పుడు వచ్చే చెత్తను అక్కడే ఒక మూలన ఉంచకూడదు. వంటగదిలో చెత్తాచెదారం ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. శుభ్రం చేసిన వెంటనే ఆ చెత్తను ఇంటి బయట ఉన్న డస్ట్‌బిన్‌లో పారవేయాలి. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ కుటుంబం అంత అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాగా చిన్న చిన్న మార్పులే మన జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి.