ఈసీకి చంద్రబాబు 8 పేజీల లేఖ

ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు.. ఈసీ అధికారులను ఉద్ధేశిస్తూ.. 8పేజీల బహిరంగ లేఖను రాశారు. ఈసీ అధికారులు బీజేపీ, వైసీపీ అధికారులకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని తన లేఖలో ఆరోపించిన చంద్రబాబు, ఐటీ దాడులతో తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. టీడీపీ చేసిన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, పోలీసు పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న కేకే శర్మను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ […]

ఈసీకి చంద్రబాబు 8 పేజీల లేఖ
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 1:23 PM

ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు.. ఈసీ అధికారులను ఉద్ధేశిస్తూ.. 8పేజీల బహిరంగ లేఖను రాశారు. ఈసీ అధికారులు బీజేపీ, వైసీపీ అధికారులకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని తన లేఖలో ఆరోపించిన చంద్రబాబు, ఐటీ దాడులతో తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. టీడీపీ చేసిన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, పోలీసు పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న కేకే శర్మను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

టీడీపీ అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. జరుగుతున్న దాడులతో పార్టీ కేడర్ నైతిక సామర్థ్యం దెబ్బతీస్తూ, ఇతర పార్టీలను ప్రొత్సహించేలా ఉందని మండిపడ్డారు.

Latest Articles