ఈసీ తీరుపై ఫైర్ అయిన నారా లోకేష్

అమరావతి: ఎన్నికల సంఘం తీరుపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈసీ తీరుపై ఫైర్ అయ్యారు. టీడీపీ ఫిర్యాదులను ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని.. ప్రతిపక్షం ఆరోపణలపై మాత్రం అతిగా స్పందిస్తోందని అన్నారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఈసీ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులు, నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం దేనికి సంకేతం అని ఫైర్ అయ్యారు. ఈసీ చేస్తున్న […]

  • Ravi Kiran
  • Publish Date - 5:05 pm, Tue, 9 April 19
ఈసీ తీరుపై ఫైర్ అయిన నారా లోకేష్

అమరావతి: ఎన్నికల సంఘం తీరుపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈసీ తీరుపై ఫైర్ అయ్యారు. టీడీపీ ఫిర్యాదులను ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని.. ప్రతిపక్షం ఆరోపణలపై మాత్రం అతిగా స్పందిస్తోందని అన్నారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఈసీ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులు, నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం దేనికి సంకేతం అని ఫైర్ అయ్యారు. ఈసీ చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.