జగన్‌ను ఓడిస్తేనే.. కేసీఆర్‌కు గుణపాఠం: చంద్రబాబు
ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీడీపీకి శ్రీరామ రక్ష అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అన్నారు. కాగా.. అన్ని సర్వేలు టీడీపీకే అనుకూలమని తేల్చాయి.. అయినా కూడా.. మన కృషి మనం చేయాలి అని పేర్కొన్నారు. జగన్ మేలు కోసమే కేసీఆర్ హోదా డ్రామా ఆడుతున్నారని అన్నారు. జగన్‌తో […]
ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీడీపీకి శ్రీరామ రక్ష అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అన్నారు. కాగా.. అన్ని సర్వేలు టీడీపీకే అనుకూలమని తేల్చాయి.. అయినా కూడా.. మన కృషి మనం చేయాలి అని పేర్కొన్నారు. జగన్ మేలు కోసమే కేసీఆర్ హోదా డ్రామా ఆడుతున్నారని అన్నారు. జగన్‌తో కుమ్మక్కు రాజకీయాలను కేసీఆరే చేయిస్తున్నారని చెప్పారు. కేసీఆర్, రాంమాధవ్, జగన్ వ్యాఖ్యలే.. ఈ మూడు పార్టీల లాలూచీకి రుజువన్నారు. జగన్‌ను ఓడిస్తేనే కేసీఆర్‌కు గుణపాఠం చెప్పినట్టు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.