130 స్థానాల్లో టీడీపీదే గెలుపు.. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు

అమరావతి : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గెలుపు విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. తనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి 130 సీట్లు వస్తాయని వెల్లడించారు. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని అన్నారు. అర్థరాత్రి వరకు విధులు నిర్వహించిన పార్టీ బూత్ ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఇదే పోరాట పటిమ […]

130 స్థానాల్లో టీడీపీదే గెలుపు.. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 12, 2019 | 12:29 PM

అమరావతి : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గెలుపు విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. తనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి 130 సీట్లు వస్తాయని వెల్లడించారు. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని అన్నారు. అర్థరాత్రి వరకు విధులు నిర్వహించిన పార్టీ బూత్ ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వచ్చే 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని చంద్రబాబు అన్నారు. ఫలితాలు వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇక ఓడిపోతున్నామనే భయంతోనే వైసీపీ పలు చోట్ల విధ్వంసాలకు తెరలేపిందని చంద్రబాబు ఆరోపించారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు టీడీపీ వైపు నిలిచారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.