నేటి నుంచి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వాముల కల్యాణ బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వాముల కల్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ తెలిపారు. సోమవారం నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఆదివారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీ గంగా పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరస్వామివార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను గతంలో ఎన్నడూలేనంత వైభవంగా నిర్వహించనున్నట్టు వివరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు, స్వామివార్లతో రోజుకొక వాహనంపై (వాహన సేవ) […]
ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వాముల కల్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ తెలిపారు. సోమవారం నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఆదివారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీ గంగా పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరస్వామివార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను గతంలో ఎన్నడూలేనంత వైభవంగా నిర్వహించనున్నట్టు వివరించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు, స్వామివార్లతో రోజుకొక వాహనంపై (వాహన సేవ) ఆశీనులైన ఉండగా కనుల పండువగా నగరోత్సవం నిర్వహిస్తామన్నారు. సోమవారం గజవాహనం, మంగళవారం రావణ వాహనం, బుధవారం నంది వాహనం, గురువారం సింహ వాహనం, శుక్రవారం వెండిరథంపై దుర్గా మల్లేశ్వరుల నగరోత్సవాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. రోజూ సాయంత్రం 5 గంటలకు మల్లికార్జున మహామండపం వద్ద నుంచి నగరోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కల్యాణ బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతాయని వివరించారు.