Gautham Menon : ఇక్కడ నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు.. ఆ కారణంతోనే బతికి ఉన్నాను.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ సాయం చేయడం చేయడానికి ఎవరు లేరన్నారు.
గౌతమ్ మీనన్.. సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. 2001లో మాధవన్ నటించిన మిన్నెలే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో రీమాసేన్ కథానాయికగా నటించింది. మొదటి సినిమాకే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాలో హారిస్ రాజ్ స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ గౌతమ్ మీనన్‌కి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాయి. కొన్నాళ్లుగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్.. తనకు అవసరమైనప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ సహకరించరని అసహనం వ్యక్తం చేశారు.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ..”ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. నేను తీసిన ధ్రువ నక్షత్రం విడుదల విషయంలో సమస్యల గురించి ఎవరూ స్పందించలేదు. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇండస్ట్రీ ఆ సినిమాను పట్టించుకోలేదు. ఆ సినిమా గురించి ఎవరికీ తెలియదు. ధనుష్, లింగుస్వామి మాత్రమే దీని గురించి అడిగారు. విడుదల చేయడానికి ప్రయత్నించారు. కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను. కానీ కొన్ని సమస్యలు ఉన్నందున ఎవరూ దానిని స్వీకరించలేదు. విడుదల చేయడానికి ముందుకు రాలేదు. ప్రేక్షకులు ఇంకా నా సినిమాలు చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను బతికి ఉన్నాను. “అంటూ చెప్పుకొచ్చారు.
2016లో విక్రమ్ నటించిన ధ్రువనక్షత్రం చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. అనేక సమస్యల కారణంగా షూటింగ్ ఆగిపోయి చాలా ఏళ్లుగా సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా విడుదల తేదీని పలుమార్లు ప్రకటించినా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయం గురించి గౌతమ్ మాట్లాడుతూ.. ఈ సినిమా సమస్యలో తనకు ఎవరూ సహాయం చేయలేదని నిరాశగా మాట్లాడాడు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..