కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.? మీ గుండె షెడ్డుకే

13 January 2025

Ravi Kiran

జస్ట్ రిఫ్రెష్ కోసం చాలామంది శీతల పానీయాలు తెగ తాగేస్తుంటారు. అయితే ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైద్యులు చెబుతున్నారు. 

రోజూ శీతల పానీయాలు తాగడం వల్ల ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అధిక బరువు, షుగర్ వస్తుందని, కొలస్ట్రాల్ అండ్ బీపీ పెరిగి గుండె జబ్బులొస్తాయని తెలిపారు.

సిటీలలో ఉండే యువత, అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ శీతలపానీయాలు అధికంగా సేవిస్తుంటారని ఓ స్టడీ చెబుతోంది. అలా తాగడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్స్ చెబుతున్నారు. 

ఈ శీతల పానీయాల వల్ల అనారోగ్యపాలై 2020లో 3.4 లక్షల మండి చనిపోయారన్నారని ఓ స్టడీలో తేలిందట. శుద్దమైన నీరు అందుబాటులో ఉంటే ఇవి తాగొద్దని సూచించారు.  

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి నీరు తాగడం చాలా ఉత్తమమని అంటున్నారు. అలాగే అప్పుడప్పుడూ పండ్లు తినాలని చెబుతున్నారు. 

అటు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయన్నారు. 

మార్కెట్‌లో దొరికే ప్యాకెజ్డ్ జ్యూస్‌లు, శీతల పానీయాల్లో చక్కెర, కృత్రిమ పదార్ధాలు ఎక్కువగా ఉంటాయని.. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నారు.

శీతల పానీయాల కంటే.. వాటి ప్రత్యామ్నాయాలను అనుసరించి.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించండి అని వైద్యులు చెబుతున్నారు.