అసలు ఏపీ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే?

అమరావతి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలు మే మూడో వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఫలితాల విడుదలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్‌ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్‌ మార్కులను కూడా అందుబాటులో ఉంచాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించారు. గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్‌ కోసం మార్కులివ్వాలని సీఎస్‌ సూచించారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాతే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏపీ ఎంసెట్‌ పలితాలు వాస్తవానికి మే […]

అసలు ఏపీ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే?
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2019 | 5:18 PM

అమరావతి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలు మే మూడో వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఫలితాల విడుదలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్‌ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్‌ మార్కులను కూడా అందుబాటులో ఉంచాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించారు. గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్‌ కోసం మార్కులివ్వాలని సీఎస్‌ సూచించారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాతే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఏపీ ఎంసెట్‌ పలితాలు వాస్తవానికి మే 1న ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఆ తేదీని వాయిదా వేశారు. అయితే, సంబంధిత వెబ్‌సైట్‌ (sche.ap.gov.in)లో మాత్రం మే 1నే ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది.