బాబూ!..మరి మీ నిర్వాకమేమిటి? భగ్గుమన్న కన్నా

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంటుంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు ఎన్ని వేషాలు వేశారో అందరికీ తెలుసని అన్నారు. […]

బాబూ!..మరి మీ నిర్వాకమేమిటి? భగ్గుమన్న కన్నా
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 01, 2019 | 5:05 PM

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంటుంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు ఎన్ని వేషాలు వేశారో అందరికీ తెలుసని అన్నారు. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు..ఆనాడు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్‌లో దాచినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది అని కన్నా చంద్రబాబును ప్రశ్నించారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే కుమారస్వామికి మద్దతుగా 110మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తీసుకొచ్చి దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యానికి భంగం కలగలేదా? అని నిలదీశారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మోదీ రీసెంట్‌గా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.