వైజాగ్‌లో ఏపీ సెక్రటేరియట్ ఎక్కడ ఉండబోతుందంటే..!

విశాఖకు ఎగ్జిగ్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించినప్పటికీ.. దానిపై ఇంకా అధికారిక ప్రకటనను ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై ప్రకటన చేయాల్సి ఉన్నా.. ఈ నిర్ణయాన్ని మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసింది జగన్ సర్కార్. అయితే రాజధాని తరలింపుకు సంబంధించి పనులు వైజాగ్‌లో శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి బిల్డింగ్‌ల కోసం ప్రభుత్వాధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీలోని కొన్ని బ్లాక్‌లు సెక్రటేరియట్‌కు […]

వైజాగ్‌లో ఏపీ సెక్రటేరియట్ ఎక్కడ ఉండబోతుందంటే..!

విశాఖకు ఎగ్జిగ్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించినప్పటికీ.. దానిపై ఇంకా అధికారిక ప్రకటనను ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై ప్రకటన చేయాల్సి ఉన్నా.. ఈ నిర్ణయాన్ని మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసింది జగన్ సర్కార్. అయితే రాజధాని తరలింపుకు సంబంధించి పనులు వైజాగ్‌లో శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి బిల్డింగ్‌ల కోసం ప్రభుత్వాధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీలోని కొన్ని బ్లాక్‌లు సెక్రటేరియట్‌కు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారట.

జాతీయ రహదారిపై మద్దిలపాలెం జంక్షన్‌ వైపు ఉన్న ఈ యూనివర్సిటీలో చాలా బిల్డింగ్‌లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయట. దానికి తోడు వాటి పక్కనే 1500మందికి సరిపడా పెద్ద కాన్ఫిరెన్స్ హాల్ ఉండటం.. వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలం ఉండటంతో.. అక్కడే సెక్రటేరియట్‌ను పెట్టాలని అధికారులు అనుకుంటున్నారట.  దీని వలన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నారట. ఇక జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో.. విజయనగరం, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఈ స్థలం అణువుగా ఉంటుందని అధికారులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పరిసర ప్రాంతాల్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్‌తో పాటు మరికొన్ని అధికారిక ఆఫీసులను పెట్టబోతున్నట్లు సమాచారం.

Click on your DTH Provider to Add TV9 Telugu