విశాఖ వాసులను నిరాశపరిచిన జగన్..!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు వెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం రాగా.. ఈసారి పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు విశాఖవాసులు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి సాదరస్వాగతం పలికారు. ఇక విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన జగన్.. ఆ తరువాత విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ఇంతవరకు […]

విశాఖ వాసులను నిరాశపరిచిన జగన్..!
Follow us

| Edited By:

Updated on: Dec 29, 2019 | 7:19 AM

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు వెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం రాగా.. ఈసారి పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు విశాఖవాసులు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి సాదరస్వాగతం పలికారు. ఇక విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన జగన్.. ఆ తరువాత విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. చివరకు విశాఖవాసులను తీవ్రంగా నిరుత్సాహపరిచారు సీఎం.

ఏపీలో మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎగ్జిగ్యూటివ్ కేపిటల్‌గా వైజాగ్ ఉండబోతుందంటూ ఆయన తెలిపారు. దీంతో విశాఖవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజా పర్యటనలో విశాఖకు సంబంధించి ఆయన ఏదైనా ప్రకటన చేస్తారని వారంతా భావించారు. కానీ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ ఉత్సవ్ ప్రారంభం తరువాత మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్‌కు సన్మానం చేయగా.. ఆ కార్యక్రమం అవ్వగానే ఏం మాట్లాడకుండా విజయవాడకు వెళ్లారు జగన్. దీంతో విశాఖవాసులు కాస్త నిరాశకు గురయ్యారు.

అయితే జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వారు ఆందోళనను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గిన జగన్.. విశాఖ ఉత్సవ్‌లో ఏం మాట్లాడకుండా వెళ్లారని తెలుస్తోంది. కానీ న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకొని.. త్వరలోనే మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని సమాచారం.