Andhra Pradesh: ఏపీలో ఉప ఎన్నికల హడావుడి.. ఢీ అంటే ఢీ అంటున్న ప్రధాన పార్టీలు.. గెలుపు ధీమాలో మద్దతు దారులు
2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన, బిజెపి లు ఈ ఉపఎన్నికల్లో నామమాత్ర పాత్రను సైతం పోషిస్తున్న పరిస్థితి కనిపించటంలేదు. ఇది పొలిటికల్ వ్యూహమంటూ ఆయా పార్టీలు నేతలు చెబుతున్నా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుపును సాధించే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో రేపు మరొకసారి పంచాయతీలలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఇవే ప్రామాణికం కావాలని పోటీలు పడుతున్నారు. ఆ క్రమంలోనే సర్పంచి మరియు వార్డు సభ్యుల విషయంలో ఎంతో జాగ్రత్తగా గెలుపు గుర్రాలకే పార్టీలు టికెట్లు కేటాయించండి ఎంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయో అర్థం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1033 గ్రామపంచాయతీలలో 66 సర్పంచ్ స్థానాలకు, 1064 వార్డు స్థానాలకు గత నెల ఆరవ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ అయ్యిందో అప్పటి నుండే అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎందుకంటే గ్రామస్థాయిలో పార్టీల గెలుపు రేపు అసెంబ్లీ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
గ్రామంలో ప్రస్తుతం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది ఎక్కువగా పంచాయతీ ఎన్నికలలోనే స్పష్టమవుతుంది. దీంతో ఏ ఒక్క అవకాశాన్ని ఏ ఒక్క స్థానాన్ని కోల్పోకూడదని అటు వైసిపి ఇటు టిడిపి మరోవైపు జనసేన తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోన్ ఈనెల 8 నుండి 10 వరకు నామినేషన్ స్వీకరించారు. 11 న నామినేషన్ల స్కూటీని నిర్వహించి, 12 ఏవైనా పత్రాలు లేని వాటిని తొలగించారు. అలాగే 13 న నామినేషన్లపై అభ్యంతరాలు స్వీకరించారు. 14న అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ జరిపి అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించారు. 17 సాయంత్రం ప్రచార సమయం ముగియడంతో రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. సస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. పోలింగ్ సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు చర్యలు చేపట్టారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అంతరం కౌంటింగ్ నిర్వహించి గెలిచిన అభ్యర్థుల్ని ప్రకటిస్తారు.
అయితే వైసీపీ టిడిపి చాలా చోట్ల నువ్వా నేనా అంటూ హోరాహోరీగా ప్రచారం సాగించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తలదన్నేలా ఈ ప్రచారం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఎన్నికలను నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 3 సర్పంచ్, 28 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా రెండు సర్పంచ్, 18 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి దీంతో ఒక సర్పంచ్, 10 వార్డులకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఏలూరు జిల్లాలో 3 సర్పంచ్, 21 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. రేపు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఎక్కువ స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.




2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన, బిజెపి లు ఈ ఉపఎన్నికల్లో నామమాత్ర పాత్రను సైతం పోషిస్తున్న పరిస్థితి కనిపించటంలేదు. ఇది పొలిటికల్ వ్యూహమంటూ ఆయా పార్టీలు నేతలు చెబుతున్నా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుపును సాధించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్లు దూరంలోనే ఇతరులను నిలిపి వేయటంతో పాటు 144సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీగా పోలీసులను తరలిస్తున్న పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
