Krishna District: నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచని ఎమ్మార్వో కార్యాలయం.. కారణం ఏమిటంటే..?..
Krishna District: కృష్ణ జిల్లా అవనిగడ్డలో నిర్మాణం పూర్తి చేస్తున్న తహశీల్దార్ కార్యాలయం నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా అవనిగడ్డలో 1912న బ్రిటిష్ పాలనా సమయంలో తాహసీల్దార్ కార్యాలయం నిర్మించారు.. 110 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ పనుల..

అవనిగడ్డ, ఆగస్టు 18: ఇది గత ప్రభుత్వం హాయంలో నిర్మాణం చేసిన భవనమా… అయితే రంగులు మాత్రమే వేస్తాం, ఇదీ అవనిగడ్డలోని అధికార పార్టీ నాయకుల తీరు. ఇదిగో ప్రారంభిస్తాం, అదిగో ప్రారంభిస్తాం, అంటూ కాలయాపన చేస్తూ.. ప్రారంభోత్సవ పనులు అటకెక్కించారు అక్కడి పాలకులు. కృష్ణ జిల్లా అవనిగడ్డలో నిర్మాణం పూర్తి చేస్తున్న తహశీల్దార్ కార్యాలయం నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా అవనిగడ్డలో 1912న బ్రిటిష్ పాలనా సమయంలో తాహసీల్దార్ కార్యాలయం నిర్మించారు.. 110 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఎమ్మార్వో కార్యాలయానికి వెళుతున్న ప్రజలు కూడా తమకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు అంటూ వాపోతున్నారు.
మరోవైపు కార్యాలయం పైకప్పులు ఊడిపడి గాయపడిన సందర్భాలు లేకపోలేదు.. అయితే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవనిగడ్డ ఎమ్మార్వో నూతన కార్యాలయానికి 90 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి భవన నిర్మాణాని పూర్తి చేశారు. కానీ నూతన కార్యాలయం ప్రారంభించే సమయానికి అప్పట్లో ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పాటైన వైసిపి కొత్త ప్రభుత్వం కూడా అప్పటినుండి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించలేదు..దీంతో బిల్డింగ్ ప్రారంభోత్సవంపై కాలయాపన చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు, స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు..
నిర్మాణం పూర్తయిన నూతన భవనాన్ని ప్రజలకు అందుబాదులోకి తెచ్చే విషయంలో అధికార పార్టీ నేతలు మొగ్గు చూపడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కార్యాలయ పరిస్థితిపై ఉన్నత అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఎమ్ఆర్వో ఆఫీస్‌కి వివిధ పనుల కోసం వెళ్లి వస్తూ ఉంటారు, అలాంటపుడు అనుకోని ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
