Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ మంది పాతవారికే ఛాన్స్..
ఆయా సామాజిక వర్గాలకు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 53 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లు, ఇతర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వ శాఖల అభివృద్ధికి సంబందించిన కార్పోరేషన్‌లు కూడా ఉన్నాయి. వీటిలో 100కు పైగా కార్పొరేషన్‌లకు బోర్డుల పదవీకాలం ముగిసింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికే చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ని నియమించారు ముఖ్యమంత్రి. చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యుల పదవీకాలం కూడా ముగియడంతో కొత్త సభ్యులను నియమించే పనిలో ఉన్నారు జగన్.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 100కు పైగా కార్పోరేషన్‌లకు చైర్మన్‌లతో పాటు డైరెక్టర్ల పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్.. ఆయా సామాజిక వర్గాలకు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 53 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లు, ఇతర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వ శాఖల అభివృద్ధికి సంబందించిన కార్పోరేషన్‌లు కూడా ఉన్నాయి. వీటిలో 100కు పైగా కార్పొరేషన్‌లకు బోర్డుల పదవీకాలం ముగిసింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికే చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ని నియమించారు ముఖ్యమంత్రి. చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యుల పదవీకాలం కూడా ముగియడంతో కొత్త సభ్యులను నియమించే పనిలో ఉన్నారు జగన్. రాజకీయ, సామాజిక పరిస్థితుల ఆధారంగా పదవులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నామినేటెడ్ పదవుల్లో పాతవారికే ఛాన్స్..!
సార్వత్రిక ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే గడువు ఉండటంతో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటం, ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో పదవుల్లో మార్పులు చేయడం ద్వారా ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తన కార్యాలయ అధికారులతో సీఎం జగన్ ఈ అంశంపై కసరతు చేశారు. కార్పొరేషన్ల చైర్మన్‌ల విషయంలో పెద్దగా మార్పులు చేయకూడదని సీఎం ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కొన్ని పదవులు తప్ప.. మెజారిటీ కార్పొరేషన్లకు పాతవారినే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం. ఎమ్మెల్యేలకు, ఇన్చార్జిలకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. అటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకంపై కసరత్తు దాదాపు పూర్తికావచ్చినట్లు సీఎంవో అధికారులు చెబుతున్నారు. టీటీడీ బోర్డులో కొంతమంది ఎమ్మెల్యే లు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు కూడా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రానికి టీటీడీ సభ్యులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..