Watch Video: సీఎం జగన్‌పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ..
సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. A1 సతీష్‌ను 15 రోజులు కస్టడీకి కోరనున్నారు దర్యాప్తు అధికారులు. నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిమాండ్‌లో నిందితుడు సతీష్ పేరును పొందుపరిచారు. సీఎం జగన్‌పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్‌కు విజయవాడ సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. A1 సతీష్‌ను 15 రోజులు కస్టడీకి కోరనున్నారు దర్యాప్తు అధికారులు. నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిమాండ్‌లో నిందితుడు సతీష్ పేరును పొందుపరిచారు. సీఎం జగన్‌పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్‌కు విజయవాడ సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎం జగన్‌ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తల భాగంలోనే కుట్ర ప్రకారం దాడి చేశాడన్నారు. సీఎం జగన్‌పై ఏ2 ప్రోద్బలంతో ఏ1 దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు పాత్ర కీలకమని పోలీసులు భావిస్తున్నారు. దుర్గారావు వెనుక ఉన్న పాత్రధారులపైనా పోలీసుల ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనలో రాజకీయ కుట్ర కోణం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇవాళ దుర్గారావును కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చే ఆదేశానుసారం దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి రానున్నాయి.
సీఎం జగన్‌పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగించారు. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగానే శ్రమించారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సతీష్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్‌టవర్ నుంచి వెళ్లిన కాల్స్‌ను పరిశీలించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలను సేకరించారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్‌కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను కూడా పరిశీలించారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీశారు. ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..