AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమ్మ బాబోయ్!! ఇదెక్కడి వింత..చెట్టు మీద పీఠం.. ఎందుకో తెలుసా?

ఆదిమానవులు అడవులలో, చెట్ల తొర్రల్లోనూ ఆవాసాలు ఏర్పాటు చేసుకునేవారు అని మనం వింటూ ఉంటాం.. క్రూర మృగాల దాడి నుంచి తప్పించుకోవడంతో పాటు వాటి కదలికలను అనుక్షణం గమనించడం కోసం ఆదిమానవులు ఇలా చేసేవారు.. కానీ ఇప్పుడు అలాంటి ఓ దృశ్యమే నెటింట్లో సందడి చేస్తుంది.

Andhra Pradesh: అమ్మ బాబోయ్!! ఇదెక్కడి వింత..చెట్టు మీద పీఠం.. ఎందుకో తెలుసా?
Eluru
B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 27, 2024 | 7:23 PM

Share

అడవులలో, చెట్ల తొర్రల్లోనూ అదేవిధంగా పెద్దగా విశాలంగా ఉన్న చెట్లపై ఆదిమానవులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవించేవారు. అడవిలో క్రూర మృగాల దాడి నుంచి తప్పించుకోవడంతో పాటు వాటి కదలికలను అనుక్షణం గమనించడం కోసం ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అడవి జంతువులతో కలిసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం ఇప్పుడున్న అడవులలో చెట్లపై అలాంటి నిర్మాణాలు దాదాపు ఎక్కడా లేవనే చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో మనకు సినిమాలలో సైతం సెట్లు వేసి చెట్లపై ఆదిమానవులు నివసించిన విధానాలను మనకు సినిమాలలో చూసే ఉంటాం. కానీ ఇక్కడ కూడా అలాంటిదే సేమ్ టు కానీ అది మాత్రం ఆదిమానవుల నివాసం కాదు.. అది ఒక ప్రార్థన మందిరం.. అయితే చెట్టుపై ఆ నిర్మాణం ఎక్కడుంది.. దానిని ఎవరు నిర్మించారు.. ఎందుకు కట్టారు.. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెంలో ఓ పెద్ద మర్రిచెట్టుపై కొన్ని సంవత్సరాల క్రితం పీఠాన్ని నిర్మించారు. ఆ పీఠం సేమ్ టు సేమ్ అడవులలో ఆదిమానవులు నివసించిన నిర్మాణాన్ని పోలీ ఉండటమే కాక ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. పిఠాపురానికి చెందిన ఉమర్ అలీషా పేరుతో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో భగవంతుని ధ్యానం కోసం ఓ పీఠాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రస్టు సభ్యులే కొన్నెళ్ళ క్రితం చీమల వారి గూడెంలో ఓ పెద్ద మర్రి చెట్టుపై మహర్షి శ్రీ మొహిద్దిన్ బాద్షా పేరుతో ఓ పీఠాన్ని నిర్మించారు.

మర్రి చెట్టుపై చతురస్రాకారంలో ఆ నిర్మాణం ఉండి పైన చెక్క కర్రలను ఉపయోగించి పైకప్పును సైతం ఏర్పాటు చేశారు. అలాగే కింద నుంచి చెట్టు పైనున్న పీఠంలోకి వెళ్లేందుకు మెట్లను కూడా నిర్మించారు. పీఠం లోపల మహర్షి శ్రీ మొహిద్దిన్ బాద్షా ఫోటో మనకు దర్శనమిస్తుంది.. ప్రతి గురువారం చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అక్కడికి పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు. ఈ విధంగా గత కొన్నేళ్లుగా మతాలకతీతంగా ఆ ప్రాంతం వాసులంతా పీఠానికి వెళ్లడం పరిపాటిగా మారింది.. అంతేకాక పీఠానికి సమీపంలోనే జమ్ము గడ్డితో నిర్మించిన పర్ణశాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించే వారికి ఓ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అక్కడికి వచ్చిన పర్యాటకులు చెట్టు పైనున్న పీఠంలోకి వెళ్లి కాసేపు ధ్యానం చేసుకుంటూ సేద తీరడమే కాక అక్కడున్న ప్రకృతి అందాలను తమ ఫోన్లో బంధించి తమ స్నేహితులకు పంపుతూ వారితో ఆ అనుభూతులను షేర్ చేసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి