AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Alert: తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాలకు బిగ్ అలెర్ట్

శనివారం(30వ తేది) వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ గరిష్టంగా 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Cyclone Alert: తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాలకు బిగ్ అలెర్ట్
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: Nov 27, 2024 | 6:36 PM

Share

ఐఎండి సూచనల ప్రకారం తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పుగా 1100 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తదుపరి 2 రోజులలో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో గురు,శుక్ర,శనివారాల్లో (28-30) కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మూడు రోజులు మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

నవంబర్ 28, గురువారం: • నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 29, శుక్రవారం : • ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కాకినాడ, అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 30,శనివారం : • నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

డిసెంబర్ 1, ఆదివారం : • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మరియు ఏలూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow Us