AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి తుఫానుగా మారనుండగా.. మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముంది. అలాగే ఇది అక్టోబర్ 28 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.

AP Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..
Ap Cyclone
Venkatrao Lella
|

Updated on: Oct 25, 2026 | 5:20 PM

Share

తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు తుఫాను హెచ్చరిక ఐఎండీ జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. గత 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా కదిలి, తీవ్ర వాయుగుండంగా బలపడిందని తెలిపింది. ఇది నేడు అక్టోబర్ 25న ఉదయం 11:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది శ్రీ విజయపురం(అండమాన్ దీవులు)కు ఉత్తర-వాయువ్య దిశలో సుమారు 420 కి.మీ. దూరంలో, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఆగ్నేయ దిశలో సుమారు 870 కి.మీ. దూరంలో, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఆగ్నేయ దిశలో సుమారు 960 కి.మీ. దూరంలో, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఆగ్నేయ దిశలో సుమారు 1,060 కి.మీ. దూరంలో, బాపట్ల (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు దిశలో సుమారు 1,130 కి.మీ. దూరంలో ఉందని ఐఎండీ అంచనా వేసింది.

తుఫాను కదలిక , తీవ్రతపై అంచనా

ఈ తీవ్ర వాయుగుండం దాదాపుగా నైరుతి దిశగా కదులుతూ, అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామునాటికి తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి, అక్టోబర్ 27వ తేదీ ఉదయం సమయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా  బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారి, అక్టోబర్ 28వ తేదీ ఉదయం సమయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

తుఫాను తీరం దాటే అంచనా

ఈ అతి తీవ్ర తుఫాను అక్టోబర్ 28, 2026న ఉదయం నుంచి మధ్యాహ్నానికి ముందు సమయంలో బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలుల వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు చేేపల వేటకు వెళ్లవద్దని అలర్ట్  జారీ చేసింది. ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలకు అవకాశముందని అంచనా వేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Follow Us
ఏపీ వైపు దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. ఐఎండీ లేటెస్ట్ అప్డేట్
ఏపీ వైపు దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. ఐఎండీ లేటెస్ట్ అప్డేట్
ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌
ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌
ఆలూ స్టఫింగ్‌తో కరకరలాడే మినీ కచోరీలు.. పొరలు పొరలుగా భలే రుచిగా
ఆలూ స్టఫింగ్‌తో కరకరలాడే మినీ కచోరీలు.. పొరలు పొరలుగా భలే రుచిగా
అన్ని రైల్వే స్టేషన్లలోనూ ప్లాట్‌ఫామ్ ఎత్తు ఒకేలా ఉంటుందా..?
అన్ని రైల్వే స్టేషన్లలోనూ ప్లాట్‌ఫామ్ ఎత్తు ఒకేలా ఉంటుందా..?
వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?
వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?
సమస్యను మరో కోణంలో చూస్తే పరిష్కారం దొరుకుతుంది.. జీవిత పాఠం
సమస్యను మరో కోణంలో చూస్తే పరిష్కారం దొరుకుతుంది.. జీవిత పాఠం
శ్రీహరితో సినిమా వివాదం.. 8 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన మూవీ..
శ్రీహరితో సినిమా వివాదం.. 8 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన మూవీ..
వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా
వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా
దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి..
ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి..