AP News: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా
ఎన్ని కఠిన ఆంక్షలు, చెకింగ్‌లు పెట్టినా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్‌లో తమ దొంగ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. పుష్ప మూవీని మించిన ఐడియాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో...
దాని మత్తులో పడి యువత చిత్తవుతుంది. ఊహల లోకంలో తేలియాడుతుంది. తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాల్సిన వారు కలల మైకంలో తేలిపోతున్నారు. అవును గంజాయి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. దీంతో అలర్టైన ప్రభుత్వాలు.. ఈ మత్తు మందును కూకటి వేళ్లతో పెకిలించాలని డిసైడయ్యారు. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో పోలీసులు గంజాయి నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని.. ఇచ్చాపురంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒడిశాలో కొన్న గంజాయిని.. ఇచ్చాపురం స్టేషన్ నుంచి ముంబైకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విశాల్‌యాదవ్ ఒడిశాలోని కందమాల్ జిల్లా పుల్బానిలో 5 కేజీల గంజాయి కొనుగోలు చేశాడు. దాన్ని కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ముంబైకు తీసుకెళ్లాలని మంగళవారం సాయంత్రం ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న అతనిపై పోలీస్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన వద్ద ఉన్న బ్యాగ్‌ను చెక్ చేయగా గంజాయి గుట్టు రట్టైంది. ఆ గంజాయి సీజ్ చేయడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించించారు పోలీసులు.
గంజాయి సాగు, డ్రగ్స్ వాడకంపై మున్ముందు వణుకుపుట్టించేలా యాక్షన్ ఉంటుందంటున్నారు పోలీసులు. గంజాయి చూస్తేనే గజగజ వణికే పరిస్థిలొస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ వాసన పట్టేలా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సో మత్తుబ్యాచ్ ..బీకేర్‌ఫుల్..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..